డాన్సర్ షోనాలి నడుముతో తనను పోల్చుకున్న...బ్రహ్మముడి కావ్య
డాన్స్ ఐకాన్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే ఒక్కో కంటెస్టెంట్ డాన్స్ ఇరగదీస్తూ కనిపించారు. ఇక ఇందులో షోనాలి మాంద్యన్ చేసి పెర్ఫార్మెన్స్ స్టేజి మొత్తం వేడి సెగలు పుట్టించింది. సన్నని నడుముతో సెక్సీ ఫిగర్ తో ఉఫ్ అనుకునేలా పెర్ఫార్మ్ చేసింది. "గురు" మూవీలో మల్లికా శెరావత్ చేసిన "మయ్యా,మయ్యా" సాంగ్ కి ఇరగదీసేసింది. దీంతో బ్రహ్మముడి సీరియల్ కావ్య కుళ్లిపోయింది. సోనాలి నడుమును చూసి ఏడుపు మొదలుపెట్టింది కావ్య. దాంతో పక్కనే ఉన్న యష్ చూసి "నువ్వెందుకు ఏడుస్తున్నావ్" అన్నాడు. "నిన్ను, నీ పెర్ఫార్మెన్స్ చూస్తూ అందరూ హ్యాపీ అయ్యారు. కానీ నాకు మాత్రమే బాధొచ్చింది. ఎందుకో తెలుసా. నీలాంటి నడుము నాకు లేదని" అనేసరికి..ఇందిరా ఈ సన్నని నడుము గోల అనుకుంటూ అందరూ నవ్వుకున్నారు.