English | Telugu
డాన్స్ ఐకాన్ లో మానస్ - ప్రకృతి మధ్య ఫైట్...కంటెస్టెంట్ చేంజ్
Updated : Feb 27, 2025
డాన్స్ ఐకాన్ సీజన్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ వారం షోలో ఒక కంటెస్టెంట్ ప్లేస్ లో మరో కంటెస్టెంట్ వచ్చింది. లాస్ట్ వీక్ షోలో మెంటార్ ప్రాకృతి కంటెస్టెంట్ బర్కత్ అరోరా అనే చిన్న పాప వచ్చింది. ఐతే మరి ఏమయ్యిందో ఏమో కానీ ఆ చిన్నారి ప్లేస్ లో కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు. ఆమె ఎవరో కాదు వర్థికా ఝా. ఇక ఈ వారం ప్రోమోలో ఆమె డాన్స్ ఇరగదీసేసింది. బర్కత్ అరోరా రావట్లేదు అన్న విషయాన్నీ ఓంకార్ చెప్పేసరికి ప్రాకృతి ఏడ్చేసింది.
ఐతే లాస్ట్ వీక్ ఎపిసోడ్ చూస్తే గనక చిన్న స్టెప్ సరిగా చేయలేదు అంటూ ప్రాకృతి మానస్ కంటెస్టెంట్ సాధ్విని నామినేట్ చేసింది దాంతో తట్టుకోలేక మానస్ కూడా ప్రాకృతిని తన కంటెస్టెంట్ బర్కత్ అరోరాని నామినేట్ చేసాడు. ఇక
చిన్నారి బర్కత్ అరోరా సోషల్ మీడియాలో ఆల్రెడీ చాలా ఫేమస్. 7 ఇయర్స్ చైల్డ్ ప్రాడిజీగా నేషనల్ మీడియా కూడా ఆమె గురించి వార్తా కథనాలను ప్రసారం చేసింది. బర్కత్ అసలు స్టెప్ వేస్తె క్రిస్టల్ క్లియర్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాగే బర్కత్ పార్టిసిపేట్ చేస్తున్న ఫస్ట్ డాన్స్ రియాలిటీ షో డాన్స్ ఐకాన్ అంటూ కూడా చెప్పాడు యాంకర్ ఓంకార్. మరి లాస్ట్ వీక్ మానస్ - ప్రకృతి మెంటార్స్ మధ్య జరిగిన నామినేషన్స్ ఇష్యూ కారణంగా బర్కత్ ఈ వారం మాత్రమే రాదా అసలుకే ఈ సీజన్ కి రాదా అన్న విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. కానీ ఆమె ప్లేస్ లో మాత్రం కొత్త కంటెస్టెంట్ వచ్చేసింది. ఆల్రెడీ నామినేషన్స్ లోకి కూడా వెళ్ళిపోయింది.