English | Telugu

సీరియల్ లో గెస్ట్ రోల్స్ గా ఆట సందీప్, జ్యోతిరాజ్  

జీ 5 లో ప్రసారమయ్యే సీరియల్స్ లో "గుండమ్మ కథ" సీరియల్ ఆడియన్స్ కి ఎంతో ఇష్టమైన సీరియల్. ఐతే ఈ సీరియల్ లో ఇప్పుడు కొంతమంది కొరియోగ్రాఫర్స్ గెస్ట్ రోల్స్ చేయడానికి వెళ్తున్నారు. అంటే అప్పుడప్పుడు సీరియల్స్ లో ఏవో ఒక పాటల పోటీలో, డాన్స్ పోటీలో పెట్టి దాని రిలేటెడ్ ఉన్న కొంతమంది సీనియర్ సెలబ్రిటీస్ ని స్పెషల్ గెస్ట్స్ గా స్పెషల్ ఎపిసోడ్స్ గా ప్లాన్ చేస్తూ ఉండడం మనకు తెలుసు. ఎందుకంటే సీరియల్స్ నార్మల్ గా అలా వెళ్ళిపోతూ ఉన్నా ఆడియన్స్ కిక్ అనేది రాదు. ఒక్కో టైములో సీరియల్ అంటేనే బోర్ కొట్టే పరిస్థితి వస్తుంది. అలా రాకుండా ఉండడం కోసం కొన్ని సీన్స్ ని యాడ్ ఆన్ చేసి ఇలా బుల్లితెర, సిల్వర్ స్క్రీన్ సెలబ్రిటీస్ ని పిలిచే ఆనవాయితీ ఎప్పటినుంచో ఉంది. ఇక ఇప్పుడు కూడా గుండమ్మ సీరియల్ లో కూడా ఇద్దరు సెలబ్రిటీస్ తో ఒక స్పెషల్ ఎపిసోడ్ ని డైరెక్టర్ ప్లాన్ చేశారు.

డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో మెరిసిన  సాధ్వి మజుందార్

డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ ప్రోమో ఫుల్ జోష్ తో కొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే ఇందులో ఎన్నో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముందుగా సాధ్వి మజుందార్ తన డాన్స్ ఫార్మ్ తో స్టేజి మీద ఫైర్ పుట్టించేసింది. ఐతే సాధ్వి ఫేమస్ హిట్ మూవీ శ్యామ్ సింగరాయ్ లోని "దీన్ తానా" అనే సాంగ్ కి అద్భుతంగా చేసింది. దాంతో జడ్జెస్, మెంటార్స్ అంతా ఫిదా ఇపోయారు. ఆ తర్వాత యాంకర్ ఓంకార్ సాధ్వి గురించి చెప్పారు. శ్యామ్ సింగరాయ్ మూవీలో సాయి పల్లవితో ఆపోజిట్ సైడ్ లో ఉండి పోటాపోటీగా డాన్స్ చేసిన ఆ సాధ్వినే ఈమె అని పరిచయం చేసారు.

ధోప్ కాన్సెప్ట్ డైరెక్టర్ శంకర్ దే...

ఈ వారం సుమ అడ్డా షోకి "భైరవం" మూవీ టీమ్ వచ్చింది. ఇందులో రాజా రవీంద్ర, డైరెక్టర్ శంకర్ తనయ అదితి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వచ్చారు. ఐతే ఇందులో రామ్ చరణ్ పిక్ ని ప్లే చేసేసరికి అదితి ఫుల్ గా సిగ్గుపడిపోయింది. "మగధీర మూవీ నేను ఫస్ట్ టైం థియేటర్ లో చూసాను. రామ్ చరణ్ కి నేను బిగ్ ఫ్యాన్ ని. ఐతే ఈ మూవీ వచ్చిన కొత్తలో రామ్ చరణ్ పిక్స్ ని పేపర్ లో వచ్చినప్పుడు వాటిని కట్ చేసి స్టిక్కర్స్ గా ఇంట్లో అతికించుకునేదాన్ని. ఇప్పుడు చెప్పాలంటే ఆ విషయాలు కొంచెం ఎంబరాసింగ్ గా ఉంది.ఆయన అంటే చాలా గౌరవం, ప్రేమ రెండూ ఉన్నాయి " అంటూ తెగ సిగ్గుపడిపోయింది.

బిగ్ బాస్ లో బద్ద శత్రువులు....ఇప్పుడు ఆదర్శ మిత్రులు

ప్రియాంక జైన్-భోలే షావలి అంటే చాలు బిగ్‌బాస్ సీజన్-7లో జరిగిన గొడవే గుర్తొస్తుంది. అంతలా గొడవ పడిన వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదే  'భోలే అంటే హీరో' అనే టైటిల్‌ తో రాబోతోంది. ఇక రీసెంట్ వీళ్ళు ఫ్యామిలీ స్టార్స్ ఎపిసోడ్ షూటింగ్ కి వెళ్తూ కలిసి ఒక వీడియో చేశారు. దాన్ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు భోలే.   "హాయ్ ఒక్కసారి జస్ట్ కెమెరా అటు తిప్పుతా అంటూ ప్రియాంక జైన్ వైపు కెమెరా తిప్పి చూడండి  సాహసవీరుడు సాగరకన్య సినిమాలో హీరోయిన్‌లా మెరిసిపోతున్నావ్ .." అంటూ ప్రియాంకని పొగిడేసాడు భోలే. దీంతో ప్రియాంక కూడా "మీరెలా ఉన్నారు"  అంటూ పలకరించింది.  

ఆడోల్లకు ఇన్విజిబుల్ పవర్ వస్తే మొగుళ్లను బతకనివ్వరు

ఇష్మార్ట్ జోడి నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక నెక్స్ట్ వీక్ కి ఎంటర్టైన్మెంట్ థీమ్ ఇచ్చారు. దాంతో ఒక్కో జోడి ఒక్కో గెటప్ లో వచ్చి ఇరగదీసారు. ఇక యాంకర్ ఓంకార్ లాస్ట్ లో ఒక క్వశ్చన్ అడిగాడు.. "తేజు నీకు ఇన్విజిబుల్ పవర్ ఎం చేస్తావ్" అని అడిగాడు. వెంటనే అమర్ దీప్ మైక్ పట్టుకుని. "ప్రపంచకంలా ఆడోల్లకు ఇన్వి జిబుల్ పవర్ వస్తే అందరూ మొగుళ్ళ చుట్టే తిరుగుతారు. బాత్రూంకి పోయినా, కారెక్కిన వెనకాలే ఉంటది..షాపింగ్ పోయినా, వేరే అమ్మాయితో చిన్న కాఫీ మీటింగ్ కి పోయినా వెనకాలే ఉంటది. ఇడిసిపెట్టి యాడికి పోతాది సిన్న జోరీగ లెక్క చెవి కాడినే తిరగతా ఉంటాది. మొగుళ్లే ఊళ్లు పట్టి తిరగతారు.

Karthika Deepam2 : కార్తీక్, దీపలకి రెస్టారెంట్ ఇచ్చేసిన సత్యరాజ్.. తాత పంతాన్ని సవాలు చేసిన మనవడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -285 లో....సత్యరాజ్ రెస్టారెంట్ ని కొనడానికి జ్యోత్స్న వెళ్తుంది. తన ప్రపోజల్ సత్యరాజ్ ముందు పెట్టి.. బయట వెయిట్ చేస్తుంది. ఆ తర్వాత లోపలికి దీప, కార్తీక్ లు వెళ్తారు. నీ వల్లే నేను రెస్టారెంట్ దివాలా తీసి అమ్మే సిచువేషన్ వచ్చింది.. జ్యోత్స్న రెస్టారెంట్ కి మార్క్ క్రియేట్ చేసావని సత్యరాజ్ అంటాడు. అసలు మీరెందుకు వచ్చారని కార్తీక్, దీపలని అతను అడుగుతాడు. రెస్టారెంట్ కొనడానికి కాదు డెవలప్ చెయ్యడానికి అని కార్తీక్ అంటాడు.

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మి గతంలో షాకింగ్ నిజాలు.. అందుకే భర్తకి దూరంగా ఉంటుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -332 లో.....  రామలక్ష్మి మైథిలీగా ఎలా మరాల్సి వచ్చిందో రామలక్ష్మి గుర్తు చేసుకుంటుంది. ఫణీంద్ర, సుశీల లు రామలక్ష్మిని ఉండమని చెప్తారు. నా భర్త దగ్గరికి వెళ్ళాలంటూ వెళ్తుంది. తనే మళ్ళీ ఇక్కడికి వస్తుందని సుశీలతో ఫణీంద్ర చెప్తాడు. రామలక్ష్మి నేరుగా స్వామి దగ్గరికి వెళ్తుంది. నా భర్త లేడు.. మీరు చెప్పినట్టు వినలేదని రామలక్ష్మి బాధపడుతుంది. నీ భర్త లేడని ఎవరు చెప్పారు.. బ్రతికే ఉన్నాడని స్వామి చెప్తాడు. 

ఆదికి తడిసిపోయినట్టు ఉంది...ఎవరైనా డైపర్ వేయించండి

ఢీ జోడి షోలో అశ్విని శ్రీ- ఆది, సోనియా-సిద్దు మధ్య ఈ వారం గట్టిగానే ఫైట్ అయ్యింది. షోకి రావడంతోనే అశ్విని ఆది మీద కంప్లైంట్ చెప్పింది. "ఆదిని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఒక ముద్దు లేదు ముచ్చటా లేదు" అనేసింది. "నేను ముద్దు అడిగితే నువ్వు ఏమన్నావ్ మా అత్త అక్కడే కూర్చుంటుంది ఇవ్వడం కుదరదు అన్నావ్ కదా" అన్నాడు ఆది. తర్వాత స్టేజి మీదకు వచ్చిన సోనియా-సిద్ధుని చూసి ఆది కామెంట్స్ చేసాడు. "థియేటర్ ముందు మీ ఆవిడ ఇచ్చే రివ్యూస్ చాలా బాగుంటాయండి" అంటూ సోనియా గురించి చెప్పేసరికి సిద్దు ఒక రేంజ్ లో చూసాడు. తర్వాత సోనియా టీమ్ నుంచి డాన్స్ కంటెస్టెంట్స్ సూర్య తేజ - హంసను పంపించారు.

Illu illalu pillalu : పెళ్ళి సంబంధం చెడగొట్టిన భద్రవతి.. రామరాజుని అరెస్ట్ చేసిన పోలీసులు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -85 లో.....తిరుపతి ఫోన్ చేయగానే ధీరజ్, ప్రేమ, సాగర్, నర్మదలు ఇంటికి వస్తారు. ఆ అమ్మాయి నగలు నువ్వు తీసుకొని వచ్చావా అంటూ ధీరజ్ పై రామరాజు విరుచుకుపడతాడు. దాంతో ప్రేమ ధీరజ్ లు టెన్షన్ పడతారు. నగలు తీసుకొని రాలేదంటే ఎక్కడ ప్రేమ విషయం బయటపడుతుందోనని తీసుకన్నానని చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. వాళ్ళ నగలు వాళ్లకి ఇచ్చేయ్ అని రామరాజు అంటాడు. దాంతో నగలు లేవు పెళ్లికి ఖర్చు అయ్యాయంటూ అబద్ధం చెప్తాడు ధీరజ్.

Karthika Deepam2 : సత్యరాజ్ రెస్టారెంట్ ని కార్తీక్ సొంతం చేసుకుంటాడా.. 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -284 లో..... దీప ప్రొద్దున్నే లేచి తులసి పూజ చేస్తుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఇద్దరు కలిసి దీపం పెడతారు. ఏంటి ఏదో కోరుకున్నట్లున్నారని దీపని కార్తీక్ అడుగుతాడు. అవును మీరు మంచి స్థాయికి వెళ్ళాలని దీప అంటుంది. ఆ తర్వాత కార్తీక్ కి దీప కాఫీ తీసుకొని వస్తుంది. ఏంటి ఎక్కడికో వెళ్లినట్లున్నారు.. ఏమైందని అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఉండాలంటూ కార్తీక్ నిరాశగా మాట్లాడతాడు. అప్పుడే జ్యోత్స్న రెస్టారెంట్ లో వర్క్ చేసే ప్రభాకార్ కార్తీక్ దగ్గరికి వస్తాడు.