English | Telugu
బుల్లితెర మీద కొత్త జోడి...సుధీర్-కావ్య.... సింగిలేనా..రిలేషన్ షిప్ అలా ఏమన్నా ?
Updated : Feb 27, 2025
బుల్లితెర మీద ఆన్ స్క్రీన్ జోడీలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సుధీర్ - రష్మీ జోడి క్లిక్ ఇంతగా ఎవరూ క్లిక్ కాలేదు. ఐతే శ్రీదేవి డ్రామా కంపెనీలో హోస్ట్ చేసి వెళ్ళిపోయాక ఆ ప్లేస్ లోకి రష్మీ వచ్చి సెటిల్ ఐపోయింది. ఇద్దరూ విడిపోయి చాలా ఏళ్ళు అవుతోంది. ఐనా కూడా వీళ్లిద్దరి మీద ఇప్పటికీ జోక్స్ పేలుతూ ఉంటాయి. వీళ్ళ తర్వాత సీరియల్ జోడి నిఖిల్-కావ్య వచ్చారు. ఫుల్ ఫేమస్ అయ్యారు. తర్వాత బిగ్ బాస్ 8 కి నిఖిల్ వెళ్లే ముందు ఇద్దరూ విడిపోయారు. అసలు ఏమయ్యింది అన్న విషయం ఎవరూ చెప్పారు.
నిఖిల్ మాత్రం కావ్య ప్రేమ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నా ఇంకా అంటాడు. కావ్య మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. వీళ్ళ పెళ్లి ఐపోతుంది అనుకున్నారు. కానీ అంతా తారుమారైపోయింది. ఎవరికీ నచ్చిన షోస్ కి వాళ్ళు వెళ్తున్నారు. రీసెంట్ గా రిలీజయిన ఫామిలీ స్టార్స్ షోకి కావ్య వచ్చింది. ఇక ఈమె "నా చుట్టూ నువ్వు" అనే సాంగ్ కి సుధీర్ ని చూస్తూ డాన్స్ చేసింది. సుధీర్ కూడా ఫుల్ ఖుషీ ఐపోయాడు. తర్వాత "కావ్య గారు సింగిలేనా..రిలేషన్ షిప్ అలా ఏమన్నా ? " అని సుధీర్ అడిగేసరికి కావ్య షాకయ్యింది ఆ ప్రశ్నకు. "నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ని గుడ్డిగా నమ్మేసాను. అలా నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పు అన్న విషయం తర్వాత అర్ధమయ్యింది అని చెప్పింది. ఇలా ఎవరి దారిన వాళ్ళు విడిపోయి ఎవరికీ నచ్చిన లైఫ్ లో వాళ్ళు బతుకుతున్నారు. కానీ ఏ షోకి వెళ్లినా "మీరు సింగలా" అనే ప్రశ్నలు మాత్రం వీళ్లకు తప్పడం లేదు.