English | Telugu

Brahmamudi : కావ్యకి ప్రపోజ్ చేసిన రాజ్.. హానిమూన్ కి ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -663 లో.....ఇంట్లో అందరు కలిసి రాజ్ రాగానే చుట్టుముడతారు. నువ్వు ఎప్పుడు ఆఫీస్ అంటావ్.. నీకు కావలసిన హెల్ప్ కావ్య దగ్గర నుండి తీసుకుంటావ్ కానీ తన గురించి ఎప్పడైనా ఆలోచించావా.. అందుకే మీరు కొన్ని రోజులు హనీమూన్ కి వెళ్ళండి అని అపర్ణ, ఇందిరాదేవి అంటారు. ఇంత సడెన్ గా అంటే కష్టమని రాజ్ అనగానే.. అన్ని ఏర్పాట్లు చేసానని సుభాష్ అంటాడు. ఇదిగో ఫ్లైట్ టికెట్స్ అని ప్రకాష్ ఇస్తాడు. లగేజ్ అంటూ స్వప్న ఇస్తుంది. అందరు ప్లాన్ డ్ గా ఉన్నారు కదా.. ఇదంతా కావ్య ట్రైనింగా అని రాజ్ అనగానే.. నాకు తెలుసు మీరు నన్నే అంటారని అంటూ అలిగి కావ్య పైకి వెళ్తుంది.

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ కి రామలక్ష్మి వార్నింగ్.. తను ఊటీ బ్రాంచ్ కి వెళ్ళిపోతుందట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో.... సీఐ సీతాకాంత్ ఇంటికి వస్తాడు. తనని చూసి రామలక్ష్మి మైథిలి వేరు వేరు అని చెప్తాడో.. ఒకవేళ మైథిలి రామలక్ష్మిలు ఒకరే అని చెప్తాడో అని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. సీఐ తో రామలక్ష్మి రావడం చూసి ఇంకా టెన్షన్ పడతారు. తను ఎందుకు వస్తుంది. నేనే రామలక్ష్మిని.. వాళ్ళు నన్ను చంపాలని చూసారని చెప్తుందేమోనని శ్రీవల్లి అంటుంది. రామలక్ష్మి కోపంగా లోపలికి వస్తుంది. రామ్ ఎదరుపడి మేమే వస్తుంటే మీరే వచ్చారని అంటాడు. నువ్వు వెళ్లి కార్ లో కూర్చోమని రామ్ ని పంపిస్తుంది.

Karthika Deepam2 : జ్యోత్స్న గురించి కూపీలాగుతున్న దశరథ్.. తన ప్రాణధాత దీపే అని చెప్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -297 లో..... జ్యోత్స్న దగ్గరికి దీప వెళ్లి తిరిగి వస్తుంటే కార్తీక్ ఎదురుపడతాడు. ఆ జ్యోత్స్నకి బుద్ది చెప్పి వచ్చానని దీప అంటుంది. నువ్వు చెప్తే అక్కడ ఒక అత్త తప్ప ఎవరు నమ్మరని కార్తీక్ అంటాడు. ఇప్పుడు ఆవిడా కూడా నమ్మలేదు ఆధారాలు కావాలట.. ఎక్కడ నుండి తీసుకొని వస్తామని దీప అంటుంది. అయితే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని కార్తీక్ అనగానే దశరథ్ అన్న మాటలు దీప గుర్తు చేసుకుంటుంది. నాకు మీ లాగే ఉంది కానీ అక్కడ నుండి వస్తుంటే మీ మావయ్య గారు నన్ను ఆపి నిన్ను నా కూతురు అనుకొని అడుగుతున్నా.. ఈ విషయం ఇక్కడితో వదిలేయమని చెప్పాడు. ఇక కోపం, ఆవేశం ఎక్కడ ఉంటాయని దీప అంటుంది.

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మి కోసం సీతాకాంత్ కొత్త వ్యూహం.. రామ్ ఆమె కోసం వెళ్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -344 లో..... మైథిలి రామలక్ష్మి కాదని స్వామి ఇండైరెక్ట్ గా స్వామి చెప్తాడు. నేను రామలక్ష్మిని కాదని రామలక్ష్మి కోపంగా చెప్పి వెళ్లడంతో సీతాకాంత్ బాధపడుతాడు. కానీ శ్రీలత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. రామ్ ని సందీప్ తో పంపించి సీతాకాంత్ డల్ గా కూర్చొని ఉంటాడు. ఏంటి సీతా తను మన రామలక్ష్మి కాదు.. నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు.. నీకు డౌట్ ఉంటే నీ ఫ్రెండ్ సీఐ ఉన్నాడు కదా.. తనతో ఎంక్వయిరీ చేయించమని శ్రీలత చెప్పగానే అవునంటూ సీఐకి ఫోన్ చేస్తాడు. మనకి తను మైథిలి అని కన్ఫమ్ గా తెలుసు కదా మీరు చెప్పొచ్చు కదా అని శ్రీవల్లి శ్రీలత తో అంటుంది.