English | Telugu

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మిని చూసి శ్రీలత షాక్.. ఆ వేలంపాటలో గెలిచేదెవరంటే!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో.... రామలక్ష్మి చీకట్లో ఒంటరిగా నడుస్తూ సీతాకాంత్ తనతో ఉన్న జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటుంది. సీతా సర్ వేరొకరిని పెళ్లి చేసుకొని ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడని అనుకుంటుంది. సీతాకాంత్ వచ్చి తనని పిలిచినట్లు నువ్వే నా రామలక్ష్మివి నాపై ఒట్టేసి చెప్పమని అన్నట్లు.. దాంతో రామలక్ష్మి నేనే నీ రామలక్ష్మిని అయితే ఏంటి పెళ్లి చేసుకున్నావ్ బాబు ఉన్నాడు.. మళ్ళీ ఎందుకు నా దగ్గరికి వచ్చావంటు అడిగినట్లు ఉహించుకుంటుంది.

ఆ తర్వాత రామ్ కాళ్ళు సీతాకాంత్ నొక్కుతూ ఉంటాడు. ఈ రోజు మేడమ్ అమ్మ గురించి అడగలేదు.. ఇంకా రోషన్ వాళ్ళ మమ్మీపై అరిచింది.. తనకేమైనా స్క్రూ లూసా అని రామ్ అనగానే అలా అనొద్దు మేడమ్ చాలా మంచిదని సీతాకాంత్ అంటాడు. నేను రేపు వచ్చి మాట్లాడుతానని సీతాకాంత్ అనగానే.. ఎందుకు నాకు అమ్మని సెట్ చెయ్యాలని చెప్పి, నీ భార్యని సెట్ చేసుకుంటున్నావా అని రామ్ అంటాడు. మరోవైపు రామలక్ష్మి భోజనం చేస్తుంటుంది. నీ భర్త రెండో భార్యని చూసావా అని ఫణీంద్ర అడుగుతాడు. చూసాను కానీ అయన తను ఇష్టంగా పెళ్లి చేసుకోలేదు. ఇంట్లో వాళ్లే బలవంతంగా చేసి ఉంటారు. అయిన తన జీవితంలోకి ఇక వెళ్ళనని ఎప్పుడో అనుకున్నాను.. ఇక తన గురించి నాకెందుకని రామలక్ష్మి అంటుంది.

నేను ఎప్పుడు ఇక మైథిలీగానే ఉంటాననే ఫణింద్ర వాళ్ళతో రామలక్ష్మి చెప్తుంది. మాక్కవాల్సింది కూడ అదే అని ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత శ్రీలత, సందీప్, శ్రీవల్లి లు వేలంపాటకి వస్తారు. తక్కువ పాటకీ కొని సీతా బావకి తెలియకుండా కొంత డబ్బు మన పేరున వేసుకుందామని శ్రీవల్లి అంటుంది.... మీరేందుకు వచ్చారు మైథిలి మేడంతో ఎవరు పోటీ పడలేరని అక్కడున్నా వాళ్ళు అంటారు. అప్పుడే రామలక్ష్మి ఫణీంద్ర వాళ్లు వస్తారు. రామలక్ష్మిని చూసి శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. ఆవిడే మైథిలి గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అని చెప్తారు. వాల్లే నన్ను సీతా సర్ ని విడగొట్టాలని ట్రై చేసిందని ఫణీంద్రతో రామలక్ష్మి అంటుంది.. సరే నువ్వు రామలక్ష్మి అన్న విషయం ఎక్కడా బయటపడ్డనివ్వమని ఫణీంద్ర అంటాడు. రామలక్ష్మితో తగ్గకుండా శ్రీలత వేలంపాట పాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.