ఆర్జే కాజలా మాజాకానా..ఆస్కార్ అవార్డుకె గేలం వేసింది..
ఆర్జే కాజల్ అంటే తెలియని వాళ్లుండరు. ఆర్జేగా రేడియోలో గల గల మాట్లాడుతూ శ్రోతలను ఉర్రూతలూగిస్తూ ఉంటుంది. అంతే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా షోస్ చేస్తూ ఉంది. అలాగే బిగ్ బాస్ సీజన్ - 5కి వెళ్లి ఫేమస్ అయ్యింది. ఎన్నో సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పింది. అలాగే ఎక్స్పోజ్డ్ అనే వెబ్ సిరీస్ లో అద్భుతంగా నటించింది. అలాంటి కాజల్ బుల్లితెర మీద ఎన్నో షోస్ కి వస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంది. రీసెంట్ గా సుమ అడ్డా షోకి కూడా వచ్చింది. శివరాత్రి స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. రాగానే అందరికీ పులిహోర ఇచ్చింది సుమా. ఇక ఈ షోకి మహేష్ విట్టా, శ్వేతా వర్మ, నటరాజ్ మాష్టర్, ఆర్జే కాజల్ వచ్చారు.