English | Telugu

ఆరియానా ఇలాంటిదా ? అష్షుని అంతలా హర్ట్ చేసిందా ?

ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే అప్పటికప్పుడే క్లియర్ చేసుకోవాలి. లేదంటే ఆ బాధ ఎన్నాళ్లయినా, ఎంతమంది చెప్పిన అది పోదు. ఇప్పుడు ఆరియానా, అష్షు మధ్య జరిగింది అదే. ఫామిలీ స్టార్స్ షో వేదికగా వీళ్ళ మధ్య ఉన్న గ్యాప్స్ అన్నీ బయట పడ్డాయి. "లాస్ట్ ఇయర్ నాకో హెల్త్ ఇష్యూ వచ్చింది. నేను ఒక ఫ్రెండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను అట్లీస్ట్ ఒక కాల్ చేస్తారేమో లేదంటే మా ఇంటికి వచ్చి నన్ను చూస్తారేమో అని చెప్పి..ఆ ఫ్రెండ్ ఎవరో కాదు ఆరియానానే... బాగున్నప్పుడు ఏ ఎదవన్నా వస్తాడు..బాలేనప్పుడే కదా రావాలి " అని అష్షు తన మనసులో బాధను బయటపెట్టింది. " ఇన్ని రోజులు దీన్ని నీ మనసులో పెట్టుకున్నావా.. నేను కాల్ చేస్తే నీ హెయిర్ డ్రెస్సర్ రవి కాల్ తీసాడు. ఆంటీకి నేను మూడు నాలుగు సార్లు కాల్ చేశా. నేను మాట్లాడిస్తాను అన్నారు." అంటూ ఆరియానా ఫ్రస్ట్రేషన్ వ్యక్తం చేసింది.

"నాకు తెలీదు..సర్జరీ ఐన పేషెంట్ నుంచి నువ్వు కాల్ ఎక్స్పెక్ట్ చేస్తావని." అని అష్షు అంది. "సర్జరీ ఐన పేషేంట్ వీడియొ కాల్ లో ఒకరికి అవైలబుల్ గా ఉండి ఇంకో ఫ్రెండ్ కాల్ ని ఇగ్నోర్ చేసిందంటే అర్ధం ఏంటి ..ఎవరు ఇంపార్టెంట్ అనుకోవాలి..నువ్వు నన్ను బ్లేమ్ చేయాలనుకుంటే చెయ్యి" అంది ఆరియానా.."నిన్ను బ్లేమ్ చేస్తే నాకేం వస్తుంది" అంటూ అష్షు కూడా ఫైర్ అయ్యింది. ఇక ఆరియానా తన పక్కనే ఉన్న డాన్సర్ పండుతో "అరేయ్..అష్షుకి నచ్చినప్పుడు మాట్లాడుతుంది నచ్చనప్పుడు ఇగ్నోర్ చేస్తుందిరా..ఆమెకెన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయో నాకు తెలుసు" అని అరియానా అనేసరికి "ఓకే థాంక్యూ" అని మూతి ముడుచుకుంది అష్షు. ఇలా ఫామిలీ స్టార్స్ షోలో ఇద్దరు ఆడవాళ్ళ మధ్య అందులోనూ ఎప్పటినుంచి ఫ్రెండ్స్ గా వాళ్ళ మధ్య గట్టిగా ఫైట్ ఐతే జరిగింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.