English | Telugu
ఎంటర్టైన్మెంట్ బిజినెస్‌లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కే డబ్బులొస్తాయ్
Updated : Feb 26, 2025
సోషల్ మీడియా కానీ బుల్లితెర మీద షోస్ కానీ ఈరోజున ఎలా ఉన్నాయి అంటే డబుల్ మీనింగ్ థంబ్ నెయిల్స్ లేకపోయినా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకపోయినా వ్యూయర్ షిప్ రావట్లేదు...పైసలు కూడా రావట్లేదు. ఇప్పుడు ఇదే విషయాన్నీ ఇంద్రజ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. "నేను ఒక షోలో పని చేస్తున్నాను. అది నా షో కాదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కోసం సీన్స్ కోసం చూసేవాళ్ళే ఈరోజున ఎక్కువగా ఉన్నారు. అలాంటి వాటికే ట్రిపుల్ టైం వ్యూస్ వస్తున్నాయి. ఒక షోలో చెడ్డ విషయం వస్తోంది అనుకున్నప్పుడు ఎవరైనా చూడడం ఆపేయాలి కానీ ఈరోజున అలా జరగడం లేదు. ఒకపక్కన అలా మాట్లాడతారేంటి అంటారు మరో వైపు అలాంటివే చూస్తారు. అంటే ఈరోజు ఛీ అనిపించే వాటికే వ్యూయర్ షిప్ ఎక్కువగా ఉంది. ఇది ఎంటర్టైన్మెంట్ బిజినెస్. అలాంటప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ షో చేసేవాళ్లు ఏం చూస్తారు..ఏ కంటెంట్ కి డబ్బులొస్తున్నాయో ఆ కంటెంట్ మాత్రమే చేస్తారు కదా. ఇక షోలో అంటే వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు.. మన పని మనం చేస్తున్నాం అనుకుంటా అంతే. నా వరకూ నేను అంటే మాట్లాడే పద్ధతి, నా డ్రెస్సింగ్ స్టైల్, నేను ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలి అనుకున్నప్పుడు.
పరిస్థితిని బట్టి నేను కొన్ని జోక్స్ ని లైట్ తీసుకుంటా..కాకపోతే అంతకు మించి ఉంటే అది పద్దతి కాదండి అని పక్కకు తీసుకొచ్చి పర్సనల్ గా చెప్తాను..ఏ మీనింగ్ లో చెప్తున్నారో గమనిస్తాను..కొన్ని విషయాల్లో వాళ్ళు చేశారని మనం కూడా చేయకూడదు..ఎందుకంటే మనకు మన సంస్కారం అడ్డుపడుతుంది..కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏదైనా ఉందంటే ఎవరినీ హర్ట్ చేయకుండా చెప్తాను. ఇక మూవీస్ విషయానికి వస్తే కొంచెం ప్రాధాన్యత ఉన్న రోల్స్ వస్తే చేద్దామని చూస్తున్నా. రజాకార్ మూవీలో చాకలి ఐలమ్మ రోల్ కి గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అవార్డు అందుకున్న. ఇదివరకు ఎక్కడికి వెళ్లిన జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం మూవీ రోల్ గురించి మాట్లాడుతున్నారు.. అలాంటి రోల్స్ చేయాలి అలాంటి రోల్స్ కూడా వస్తున్నాయి " అని చెప్పింది ఇంద్రజ.