షో లో కన్నీళ్లు పెట్టుకున్న సుడిగాలి సుధీర్...
ఫ్యామిలీ స్టార్స్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో సీనియర్ లేడీ యాక్టర్స్ తో మంచి కలర్ ఫుల్ గా సాగింది. అలనాటి అందాల లేడీ కమెడియన్స్ శ్రీలక్ష్మి, వై.విజయ, కృష్ణవేణి, శివపార్వతి వచ్చారు. రాగానే స్టేజి మీద ధర్నా చేయడం మొదలు పెట్టారు. వై.విజయ ఐతే "బావ మారాలి, భర్తగా రావాలి" అని ధర్నా చేసింది. అది చూసిన హోస్ట్ సుడిగాలి సుధీర్ వీళ్ళను చూసి షాకయ్యాడు. తర్వాత షోలో కొంతమంది సీనియర్ నటులకు పవన్ కళ్యాణ్, ప్రభాస్ పిక్స్ చూపించి వాళ్ళ మూవీ డైలాగ్స్ ని చెప్పించాడు. తర్వాత వాళ్లతో లవ్ లెటర్స్ ని రాయించాడు. ఇక వై.విజయ ఐతే చక్కని లవ్ లెటర్ రాసింది. "ఆయన మంచితనం చూసి నేను నాలుగేళ్లు ప్రేమించాను. కానీ ఆయన ఒకే చెప్పలేదు. ఐ లవ్ యు అమ్ము" అంటూ ముద్దులిచ్చేసింది.