Karthika Deepam2: ఆవేశంగా తాత దగ్గరికి వెళ్ళిన దీప.. జ్యోత్స్న కన్నింగ్ ప్లాన్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-328 లో.. కాంచన, అనసూయలు.. శివనారాయణకు చాలా నచ్చజెప్పడానికి ట్రై చేస్తారు. ఆ గౌతమ్ మంచివాడు కాదు.. అతడితో జ్యోత్స్న పెళ్లి చేయొద్దని వాళ్ళు చెప్తుంటే.. శివనారాయణ మాత్రం వినడు. ఏది ఏమైనా ఈ పెళ్లి జరిగి తీరుతుందని శివనారాయణ చెప్పేసి లోపలికి వెళ్లిపోతాడు. తర్వాత సుమిత్ర, పారిజాతం ఇద్దరిని కూడా కాంచన బతిమిలాడుతుంది. సుమిత్ర వినకపోగా.. పారిజాతం మాత్రం.. తనకు నిజం తెలిసినా తెలియనట్లు నటిస్తూ మాటలు అనేస్తుంది. ఇక నిస్సహాయంగా ఏడ్చుకుంటూ అనసూయ, కాంచన తిరిగి బయలుదేర్తారు. ఇక కాంచన వాళ్లు వెళ్ళగానే జ్యోత్స్న దగ్గరికి పరుగుతీస్తుంది పారిజాతం.