English | Telugu

 అత్తల ఇంటెలిజెన్స్ ముందు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏమీ చేయలేదు

డ్రామా జూనియర్స్ సీజన్ 8 చూడబోతే ఈ సీజన్ మాములుగా ఉండేలా లేదు  అనిపిస్తోంది. ఈ సీజన్ లో స్వేచ్ఛ అనే చిన్నారితో కలిసి జడ్జ్ రోజా కూడా స్కిట్ లో పార్టిసిపేట్ చేసింది. రోజా అత్తగారిగా స్వేచ్ఛ కోడలిగా చేసింది. "ఈ అత్తలను కంట్రోల్ లో ఎలా పెట్టాలని ఏఐని అడిగాను..కానీ అత్తల ఇంటెలిజెన్స్ ముందు ఆర్టిఫీషియల్  ఇంటెలిజెన్స్ ఏమీ చేయలేదు అని ఆన్సర్ ఇచ్చింది." అని రోజాకు కౌంటర్ ఇచ్చింది స్వేచ్ఛ. వెంటనే సుధీర్ వచ్చి రింగులు బాగున్నాయండి అన్నాడు. "సెట్ లో రింగులు బాగున్నాయంటారు. బయటకు వెళ్ళాక మీ అసలు రంగులు చూపిస్తారు" అని కౌంటర్ వేసింది రోజా.

రోజాను ఆంటీ అన్న సుధీర్

డ్రామా జూనియర్స్ ప్రతీ సీజన్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంది. ఈ షోలో ఒక చిన్నారి సోదెమ్మ వేషం వేసుకొచ్చి హోస్ట్ సుడిగాలి సుధీర్ కి సోది చెప్పింది. "ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చూసినా నేనే కనపడాలి..చుట్టూ ఎప్పుడూ పోలీసులు ఉండాలి" అని సుధీర్ అనేసరికి "బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేయవయ్యా. నీ చుటూ పోలీసులే ఉంటారు. తర్వాత "నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను..ఆ అమ్మాయితో పెళ్లవుతుందా" అని సుధీర్ అడిగాడు. ఇక ఆ చిన్నారి సోదెమ్మ ఐతే "ఆ అమ్మాయికి తప్పకుండా పెళ్లవుతుందయ్యా" అంది వెంటనే జడ్జ్ రోజా వచ్చి "నీతో కాదు" అంది అంటే "అయ్యో ఐతే నాతో అవదా పెళ్లి" అన్నాడు. తర్వాత ఇంకో చిన్నారి వచ్చి స్కిట్ వేసింది. వెంటనే ఆ చిన్నారిని ఏ క్లాస్ అన్నాడు. 5th క్లాస్ అని చెప్పింది. అది విన్నాక నేను కూడా  5th క్లాస్ ఐతే అన్నాడు సుధీర్. దాంతో రోజా "నువ్వు 4th క్లాస్ అన్నట్టు గుర్తు సుధీర్" అంది. వెంటనే సుధీర్ "అది ఇందాక అన్నాను ఆంటీ" అని చెప్పాడు.

ఈటీవీకి స్టార్ మాకి పోలిక పెట్టిన ఇమ్ము

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ ఆదివారం ప్రోమో చూస్తే మొత్తం పుష్ప 2 ఫీవర్ కనిపిస్తోంది. అలాగే ఇందులో డైలాగ్స్ కూడా వేరే లెవెల్ లో ఉన్నాయి. ఇక ఇమ్ము చెప్పిన డైలాగ్ వింటే వామ్మో అనకుండా ఉండరు. ఇక అవినాష్ ఐతే కొంచెం ఎక్కువ చేసినట్టే అనిపించింది. పుష్ప లా గెటప్ వేసుకుని "నిన్ను చూస్తుంటే పీలింగ్స్ వస్తుండాయి వచ్చి ఇచ్చేది ముద్దు" అంటూ శ్రీముఖిని అడిగేసరికి "వాడే బెస్ట్ రా" అంటూ హరిని పొగిడేసింది. ఉగాది, శ్రీరామనవమి పండగలు ఐపోయాయి ఇప్పుడు పుష్ప పండగ మొదలయ్యింది. ఇంతలో కొంతమంది టీవీ స్టార్స్ వచ్చారు. "చాల రోజుల తర్వాత చెప్పారు పుష్పలో కూలోడు గెటప్ అంటే వెతుక్కుని వెతుక్కుని మరీ వేసుకొచ్చాను." అన్నాడు అమర్ దీప్..నార్మల్ గా వచ్చినా కూలోడి గానే ఉంటావ్ గా అని కౌంటర్ వేసాడు హరి.

Karthika Deepam2: దశరథ్ ని కాల్చేసిన దీప.. జ్యోత్స్న ప్లాన్ సక్సెస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-329 లో.. జ్యోత్స్న ప్లాన్ తెలుసుకున్న దీప ఆవేశంగా వస్తుంది. ఇక తనకోసం జ్యోత్స్న ఇంటి బయటే ఎదురు చూస్తుంది. తను రాగానే బాగా రెచ్చగొట్టి మాట్లాడుతుంది జ్యోత్స్న. నేను రెండు కుటుంబాలను కలుపుతాను.. బావతో నా పెళ్లి జరిగి తీరుగుతుంది. ఇది జరగాలంటే అడ్డుగా ఉంది నువ్వు నీ కూతురు కాబట్టి నిన్ను బతకనివ్వును.. నీ కూతుర్ని నమ్మను.. మీ ఇద్దరినీ చంపి మా బావ చేత తాళి కట్టించుకుంటానంటూ జ్యోత్స్న అంటుంది. దాంతో దీప లాగిపెట్టి కొడుతుంది. చంపుతానన్న మాట వచ్చిందంటే నేనే నిన్ను చంపుతానంటుంది దీప. నీకు మనిషిని చంపేంత ధైర్యం లేదు.. బావ కోసం చచ్చేంత ప్రేమ లేదు.. బావ కోసం నిన్ను నీ కూతుర్ని చంపేంత ప్రేమ నాకుందంటూ మళ్లీ జ్యోత్స్న రెచ్చగొడుతుంది. ఇద్దరు గొడవ పడుతుండగా ఇలానే ఆవేశంగా జ్యోత్స్న లోపలికి వస్తుంది. 

Eto Vellipoyindhi Manasu : వాళ్ళిద్దరిని పెళ్ళి చేసుకోమన్న రామ్.. టెన్షన్ లో సవతి తల్లి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -376 లో..... రామాలక్ష్మిని రామ్ కలవడానికి వస్తాడు. మీరు నాతోనే ఉండండి మిస్.. ఎక్కడికి వెళ్లొద్దని రామ్ అంటాడు. లేదు వెళ్ళాలని రామలక్ష్మి అనగానే.. రామ్ కిందపడిపోతాడు. రామలక్ష్మి వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. అప్పుడే సీతాకాంత్, శ్రీవల్లి, సందీప్ , శ్రీలత అందరు హాస్పిటల్ కి వస్తారు. లోపల రామ్ కి ట్రీట్ మెంట్ జరుగుతుంటే నీ వళ్లే ఇదంతా.. మా రామ్ ని ఏం చేసావ్.. మొన్న ఎంగేజ్ మెంట్ రోజు ఏదో చెప్పి రామ్ ని వెళ్లేలా చేసావ్‌‌‌.. ఇప్పుడు ఏం చెప్పావో ఇప్పుడు ఇలా అయిందంటు రామలక్ష్మిని శ్రీలత తిడుతుంది.

పెళ్లయ్యాక రొమాన్స్ చచ్చిపోయింది...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే మాత్రం ప్రతీ వారం ఆడియన్స్ ని నవ్విస్తూనే ఉంది. ఈ వారం ఎపిసోడ్ లో యాదమ్మ రాజు తన సహా కంటెస్టెంట్ సుప్రీతతో కలిసి వచ్చాడు. వీళ్లకు  బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా "మోత మోగిపోద్ది" అనేది వచ్చింది. యాదమ్మ రాజు, సుప్రీతా డాన్స్ చేస్తూ ఉండగా మధ్యలో అమర్ దీప్ వచ్చి సుప్రీతతో డాన్స్ చేయడంతో రాజు నోరెళ్లబెట్టాడు. దాంతో సుమ అమర్ ఒక్కసారన్నా రాజుతో ఒక్క ఎపిసోడ్ అన్నా డాన్స్ చేయనివ్వవా అని అడిగింది. దాంతో అమర్ "మంచి సాంగ్ పెడుతుంటే రాజు వాడుకోవట్లేదు" అన్నాడు. "నేను డాన్స్ చేస్తుంటే అలా నన్ను వదిలేసి నడిచి వెళ్ళిపోతోంది" అంటూ పాపం రాజు తెగ ఫీలయ్యాడు.

మాతా రాణి కృపతో కార్ కొన్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్...

శ్రష్టి వర్మ ఇప్పుడు టాలీవుడ్ లో నిలదొక్కుకుంటున్న లేడీ కొరియోగ్రాఫర్. పుష్ప 2  మూవీలో జాతర సీన్ లో వచ్చే సాంగ్ అంటే అందరికీ ఇష్టమే. అదే "సూసెకి అగ్గిరవ్వ మాదిరి" అనే సాంగ్.. ఇది ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఈ సాంగ్ కి అల్లు అర్జున్, రష్మిక అద్భుతంగా డాన్స్ చేశారు. సోషల్ మీడియాలో ఈ సాంగ్ మీద రీల్స్ చేయని వాళ్లంటూ ఎవరూ లేరు. ఈ సాంగ్ ని గణేష్ మాష్టర్ కంపోజ్ చేస్తే శ్రష్టి వర్మ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించింది. అలాగే తన ఇన్స్టాగ్రామ్ లో ఈ సాంగ్ కి చేసిన స్టెప్స్ వీడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈమె ఢీ షో నుంచి బయటకు వచ్చాక జానీ మాష్టర్ తో కలిసి కొన్ని మూవీస్ కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కూడా పని చేసింది.

కోడిని చంపి కుక్కకు పెడతావా...మళ్ళీ పక్షులను కాపాడాలా...ఇదేం లెక్క

ఈ వారం ఢీ షోలో అశ్విని పరువు తీసేసాడు ఆది. మెంటార్ ప్రభు మాష్టర్ ఆధ్వర్యంలో సాగర్ - శృతి వచ్చి డాన్స్ చేశారు ఐతే సేవ్ బర్డ్స్ అనే కాన్సెప్ట్ తో వీళ్ళు డాన్స్ చేశారు. డాన్స్ తర్వాత అశ్విని నాలుగు మాటలు మాట్లాడింది. పక్షుల్ని కాపాడాలి. అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్లంతా మెష్ లు వేసేసుకుంటారు. పక్షులకు కొంచెం వాటర్ కొంచెం ఫుడ్ పెట్టండి. లేదంటే చచ్చిపోతాయి ఎండాకాలం కదా అని చెప్పింది. దానికి ఆది కౌంటర్ వేసాడు. "డిన్నర్ లో కోడి తిన్నది" మళ్ళీ వాటి గురించి మాట్లాడుతోంది అన్నాడు ఆది. " వాటికి ఫుడ్ పెట్టండి, నీళ్లు పెట్టండి అంటారు చాలామంది. మళ్ళీ పక్కకు వెళ్లి అందరూ లెగ్ పీస్ తినేస్తారు." అన్నాడు ఆది. "నేను తింటానేమో కానీ నేను రోజు 30 డాగ్స్ కి ఫీడ్ చేస్తాను.