English | Telugu

‘సారంగపాణి జాతకం’మూవీ హీరోయిన్  రూపా కొడువాయుర్.. పట్టిందల్లా బంగారం

సారంగపాణి మూవీ టీమ్ లో హీరోయిన్ రూపకి మంచి కితాబిచ్చాడు ప్రియదర్శి. డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఈ వారం ఎపిసోడ్ ఈ మూవీ నుంచి డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ, ప్రియదర్శి, రూప వచ్చారు. వీళ్ళు రాగానే స్టేజి మీద ముమైత్ ఖాన్ కంటెస్టెంట్ అన్షికా వచ్చి "అహ నా పెళ్ళంటా" అంటూ మాయాబజార్ మూవీలోని ఓల్డ్ క్లాసికల్ సాంగ్ కి డాన్స్ చేసింది. ఆ డాన్స్ చూసాక అసలు ఇలాంటి డాన్స్ ని తన లైఫ్ లో చూడలేదు అంటూ ఓంకార్, ప్రియదర్శి, ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పుకొచ్చారు. తర్వాత సారంగపాణి మూవీ హీరోయిన్ రూపతో ఈ సాంగ్ కి డాన్స్ వేయాలని ఓంకార్ అడిగేసరికి దర్శి ఐతే ఆమెకు ధైర్యం చెప్పి వెళ్లి డాన్స్ చేసేసి రా అని చెప్పాడు. దాంతో ఆమె వెళ్లి డాన్స్ ఇరగదీసింది. దాంతో ఇంద్రగంటి మోహనకృష్ణ చూసి చాలా ఫీలయ్యాడు. "ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నా.

రాజు గారి గది 4 లో చిన్న దెయ్యంగా నటించే ఛాన్స్ కొట్టేసిన బినిత

డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఈ వారం షో ఫుల్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. మంచి డాన్స్ లతో అలరించింది. ఫైనల్ గా ప్రాకృతి - మానస్ కి మధ్య ఎప్పటిలాగే గొడవ జరిగిపోయింది. ఐతే ప్రాకృతి తన మాటలకు సారీ చెప్పింది. ఐతే ఇంత షోలో యష్ మాష్టర్ కంటెస్టెంట్ కి ఓంకార్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆమె ఎవరో బినిత ఛెత్రి. అసలు బినీత డాన్స్ మాములుగా ఉండదు. ఈమె ఇండియాస్ గాట్ టాలెంట్ లో చేసిన పెర్ఫార్మెన్స్ కి జడ్జెస్ అంతా షాకయ్యారు.... ఆమె డాన్స్ కి ఫిదా ఇపోయారు. ఇప్పుడు ఆమె తెలుగు డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో యష్ మాష్టర్ కంటెస్టెంట్ గా ఉంది. ఈ వారం బినిత డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసాక యాంకర్ ఓంకార్ ఒక మాట అన్నాడు. నెక్స్ట్ "రాజు గారి గది 4 " చేస్తే గనక బినితని డెఫినిట్ గా తీసుకుంటాను అని చెప్పాడు.

ప్రాకృతికి ఇచ్చిపడేసిన అమర్ దీప్...

డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో మానస్ కి ప్రాకృతికి మధ్యలో కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐతే మానస్ మొదట్లో సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు తర్వాత వైల్డ్ కార్డు ద్వారా తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. ఐతే కొత్త కంటెస్టెంట్ సాగరికతో వచ్చాడు. మానస్ ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే తిరిగి రాబట్టుకున్నాడు. డాన్స్ తో దుమ్ము దులిపి ఆరేసాడు. వైల్డ్ కార్డులో ఎవరొచ్చినా నామినేట్ చేసేస్తారా..?వైల్డ్ కార్డులో రావడం పాపమా ? నామినేట్ చేయడమంటే డాన్స్ బాలేదనో, స్టెప్స్ సరిగా లేవనో చెప్పి నామినేట్ చేయాలి. ఐనా ఎవరో పంపిస్తే వెళ్ళిపోయి ఎవరో పంపిస్తే షోలోకి రావడం కాదు. కంటెస్టెంట్ కి బాగోకపోవడం వలన సెల్ఫ్ నామినేట్ చేసుకుని బయటకు వచ్చాడు తప్ప అక్కడ ఎవరు ఎవరినీ పంపించేంత సీన్ లేదక్కడ అన్నాడు అమర్.

Illu illalu pillalu:  భాగ్యం డైరెక్షన్ లో శ్రీవల్లి.. ఆ ఇంటిని గుప్పిట్లో పెట్టుకోగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-136లో..  పెద్దోడి పెళ్ళి అవుతుంది. ప్రేమ ప్లాన్ వల్లే ఇదంతా సాధ్యమని ప్రేమకి థాంక్స్ చెప్తాడు ధీరజ్. ఇక తన మీద అరవలేదని తను కూడా థాంక్స్ చెప్తుంది. ఇక ఆ తర్వాత ధీరజ్, ప్రేమ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే నర్మద అతని భర్త కూడా కలిసి చేస్తాడు. ఇక వీరిని చూసి పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు  ఇద్దరు పీటల మీద నుండే డ్యాన్స్ చేస్తుంటారు. అదంతా సరదగా సాగుతుంది. అందరు ఎంజాయ్ చేస్తుంటే రామరాజు మాత్రం ఏదో ఆలోచిస్తుంటాడు. 

Karthika Deepam2: జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. స్పృహలోకి వచ్చిన దశరథ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-335లో.. పోలీస్ స్టేషన్ కి జ్యోత్స్న వస్తుంది. ఇక సెల్ లో ఉన్న దీపని రెచ్చగొడుతుంది జ్యోత్స్న. ఇక తను రెచ్చిపోయి జ్యోత్స్న పీక పట్టుకోవడంతో ఎస్ఐ వచ్చి వార్నింగ్ ఇస్తాడు. ఇక కార్తీక్ సారీ చెప్పడంతో ఎస్ఐ వదిలేస్తాడు. రిజిస్టర్ లో సంతకం చేసి జ్యోత్స్న వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే దీపకి ఆవేశం తగ్గించుకోమని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ కోసం బయట జ్యోత్స్న వెయిట్ చేస్తుంటే అతను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడు. అది గమనించిన జ్యోత్స్న.. బావా నీతో మాట్లాడాలని అంటుంది. నీకు మాట్లాడటం కూడా వచ్చా.. అంటే నీకు గొడవ పడటం తప్ప మిగతా మనుషుల్లా మామూలుగా మాట్లాడవు కదా అని కార్తీక్ అంటాడు. మా డాడీ ఆసుపత్రిలో ఉన్నారని జ్యోత్స్న అనగానే.. నా భార్య పోలీస్ స్టేషన్‌లో ఉందని కార్తీక్ అంటాడు.

లోన్ యాప్ తో ఇబ్బందులు పడుతున్న ప్రియాంక నాయుడు...జాగ్రత్తగా ఉండండి

"వదినమ్మ" సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న ప్రియాంక నాయుడు అందరికీ తెలిసిన నటి. ఈ సీరియల్ తర్వాత ఆమె దీపారాధన అనే సీరియల్ తో ఆడియన్స్ కి మరింత దగ్గరయింది. అలాంటి ప్రియాంక ఇప్పుడు కొన్ని ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఐతే కొంతమంది స్కామర్లు కారణంగా ఆమె పడుతున్న బాధను ఒక వీడియోగా చేసి ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. రీసెంట్ గా ఆమె ఒక లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసిందట. బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్లు చెప్పింది. ఐతే తర్వాత అదొక ఫేక్ స్కాం యాప్ అని తెలిసింది. ఆ యాప్ కారణంగా తన ఫోన్ మొత్తం హ్యాక్ అయ్యిందని చెప్పింది. దాంతో ఆ స్కామర్లు తన ఫామిలీ మెంబర్స్ ని, ఫ్రెండ్స్ కి బెదిరింపు కాల్స్ చేస్తున్నారని తనకు ఎంతో భయమేస్తోంది ఆవేదన వ్యక్తం చేసింది.

చనిపోయేలోపు ఒక్కసారైనా నేను ఇలా...

బ్రహ్మముడి సీరియల్ ద్వారా దీపికా రంగరాజు తెలుగు ఆడియన్స్ ని అలరిస్తోంది.ఆమె అల్లరి గురించి మాటల్లో చెప్పడం కంటే షోస్ లో చూస్తే చాలు. ఏ షో చేసిన ఆ షో ప్రోమోలో హైలైట్ అయ్యేది దీపికా మాత్రమే. అలా చేస్తుంది అల్లరి. బ్రహ్మముడి సీరియల్ తో పాటు డాన్స్ ఐకాన్ షోకి మెంటార్ అలాగే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే షోలో సమీరా భరద్వాజ్ కి జోడి కంటెస్టెంట్ గా చేస్తోంది. అలాంటి దీపికా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైమింగ్ ఉన్న లేడీ ఆర్టిస్ట్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టింది. అది చాలా వెరైటీగా ఉంది. "నా జీవితంలో చనిపోయేలోపు  ఒక్కసారైనా నేను ఇలా రైడ్ కి వెళ్ళాలి అనుకుంటున్నా..దీన్ని మంగోలియా గ్రాస్ స్లైడ్" అంటారు అని పోస్ట్ చేసింది.

రోజా నీతో పెట్టుకుంటే... నా బతుకు జట్కాబండి ఐపోతుంది

డ్రామా జూనియర్ సీజన్ 8 లో జగపతిబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఆ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో జగపతి బాబు, ఆమని, రోజా అంటే శుభలగ్నం మూవీ టీమ్ వచ్చింది. ఇక ఆమని ఆ సినిమాలో లాగే జగపతి బాబు స్టేజి మీదకు రాగానే "పొరుగింటి మంగళ గౌరీ" సాంగ్ పాడింది. "పక్కింటి వరలక్ష్మి వాళ్ళ ఆయన వారానికి ఒక సారి సినిమాకు తీసుకెళ్తాడట" అని చెప్పింది. "అవును నేను వాళ్ళ ఆయన్ని అడిగాను కానీ ఆయన ఒప్పుకోలేదు" అన్నాడు జగపతి బాబు. ఇక ఇంకో అమ్మాయిని చూస్తూ "మేడలో బంగారు గొలుసు ఎంత బాగుందండి" అని ఆమని అనేసరికి "మెడ చూసా చాలా బాగుంది" అన్నాడు. " ఆ శుభలగ్నంలో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానా అండి" అని అడిగింది.

Illu illalu pillalu : అన్నయ్యని తీసుకొచ్చిన తమ్ముడు.. ఎట్టకేలకు శ్రీవల్లి, చందుల పెళ్ళి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -135 లో.... చందు బావని కనిపెట్టాలంటే నాదగ్గర ఒక ప్లాన్ ఉందని ధీరజ్ తో ప్రేమ చెప్తుంది. ప్రేమ భద్రవతి కి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అత్త అని అంటుంది‌. దాంతో ప్రేమని కలుస్తుంది భద్రవతి. అదే సమయంలో విశ్వకి ధీరజ్ ఫోన్ చేసి.. మీ అత్తని కిడ్నాప్ చేసానని చెప్తాడు. దాంతో తన ప్లాన్ ఫెయిల్ అయిందని విశ్వ డిస్సపాయింట్ అవుతాడు. ఇప్పుడు మా అన్నయ్యని తీసుకొని రాకుంటే మీ అత్తయ్య ఉండదని విశ్వని బెదిరిస్తాడు ధీరజ్.