Brahmamudi : రాజ్ కోసం హోటల్ లో వెయిట్ చేస్తున్న కావ్య.. వాళ్ళిద్దరు అతడిని చూస్తారా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -683 లో.... ఒకవైపు నుండి రాజ్ దగ్గరికి కావ్య వస్తుంటే.. మరోవైపు నుండి రాజ్ దగ్గరికి యామిని వెళ్లి హగ్ చేసుకొని థాంక్స్ బావ పెళ్లి కి ఒప్పుకున్నందు అని చెప్తుంది. అలా చెప్పగానే కావ్య, అప్పు ఇద్దరు షాక్ అవుతారు. నాన్న గురించి అలోచించి ఈ పెళ్లికి ఒప్పుకుంటే వద్దని యామిని అనగానే లేదు నాకు ఇష్టమే అని రాజ్ అంటాడు. ఆ తర్వాత అప్పు, కావ్య ఇంటికెళ్తారు అసలు అతను బావనే అని నమ్ముతున్నావా అని కావ్యని అప్పు అడుగుతుంది.