English | Telugu

Karthika Deepam2: కోనేరులో ప్రాణధాత ప్రతిబింబం.. పట్టరాని సంతోషంలో దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -323 లో....కార్తీక్ రెస్టారెంట్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. దీపా పద రెస్టారెంట్ కి అంటాడు. నేను రాను బాబు ఇక రెస్టారెంట్ కి.. అక్కడికి ఎవరో ఒకరు వస్తున్నారు.. మాటలు అంటున్నారు.. నా వల్ల మీరు మాటలు పడాల్సి వస్తుందని దీప బాధపడుతుంది. నేను మీ జీవితంలోకి వచ్చాను కాబట్టి మీరు అందరికి దూరమయ్యారు. పెళ్లిలు పైనే జరుగుతాయని అంటారు కానీ మన పెళ్లి భూమ్మీద జరిగింది. నేనొక బాటసారిని మాత్రమే మా నాన్న వల్ల కలిసాం.. నా కూతురు వల్ల పెళ్లి చేసుకున్నామని దీప తన లోని బాధని చెప్తుంటే కార్తీక్ మౌనంగా వింటాడు.

Illu illalu pillalu : అమ్మకి శుభలేఖ ఇచ్చిన వేదవతి.. కాల్చేయబోయిన భద్రవతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -123 లో.. చందుని శ్రీవల్లి ఇంటికి రమ్మని చెప్తుంది. చందు ఒక్కడే కాకుండా తన తమ్ముళ్లని వెంటపెట్టుకొని వస్తాడు. వాళ్ళ ముందు మాట్లాడడం కుదరదని భాగ్యం వాళ్లని బయటకు పంపిస్తుంది‌. ఇక భాగ్యం చెప్పినట్టుగా శ్రీవల్లి తన నటన మొదలుపెడుతుంది. మీకొక విషయం చెప్పాలి కానీ అది ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదండి.. నాకు టెన్షన్ గా ఉందని అంటుంటే ఏం పర్లేదు చెప్పండి అని చందు అంటాడు. అదంతా భాగ్యం దూరం నుండి చూస్తుంటుంది. ఈ పెళ్లి ఒక పది రోజులు వాయిదా వెయ్యండి అని శ్రీవల్లి చెప్తుంది. ఎందుకని చందు అడుగుతాడు.. మా వాళ్ళు డబ్బులు ఎవరికో అవసరం అయితే ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం చేతిలో డబ్బు లేదు.. ఈ విషయం మా వాళ్ళు మీ వాళ్ళతో చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.. అందుకే మీతో చెప్తున్నానని శ్రీవల్లి అంటుంది.

Karthika Deepam2 : శ్రీధర్ మాటలకి చొక్కా పట్టుకున్న కార్తీక్.. బోరున ఏడ్చేసిన దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -322 లో.. దీప ఇంటికి రాగానే కార్తీక్ ఎక్కడికి వెళ్ళావంటూ అడుగుతాడు. తనెందుకు చెప్తుంది.. నేను చెప్తానంటూ శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. నువ్వెందుకు వచ్చావ్.. అర్జెంట్ గా ఇల్లు ఖాళీ చెయ్యాలి.. ఎప్పుడు ఈ దరిద్రం ఏంటోనని శ్రీధర్ ని చూసి కార్తీక్ చిరాకుపడతాడు. మార్చాల్సింది ఇల్లు కాదు.. ఇల్లాలిని అని శ్రీధర్ అంటాడు. దాంతో కార్తీక్ శ్రీధర్ చొక్కా పట్టుకుంటాడు. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళండి అని శ్రీధర్ తో కార్తీక్ అంటాడు. నీ భార్య ఎక్కడి నుండీ వచ్చిందో తెలుసా. శివన్నారాయణ ఇంటి నుండి అని శ్రీధర్ అనగానే కార్తీక్, కాంచన షాక్ అవుతారు.

Eto Vellipoyindhi Manasu : ఫణీంద్రతో గొడవకి దిగిన శ్రీలత.. అతను పెళ్ళికి ఒప్పుకుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో  వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -369 లో..... మాణిక్యం ఇంటినుండి రామలక్ష్మి ని తీసుకొని వస్తాడు సీతాకాంత్. తన అమ్మ నాన్న ప్రేమ చూసి ఎమోషనల్ అవుతుంది. ఏంటి వాళ్లు మీ అమ్మ నాన్ననా అని సీతాకాంత్ అనగానే.. లేదు కానీ నాకు చిన్నప్పటి నుండి అమ్మనాన్న లేరు.. వాళ్ళు అలా ప్రేమ చూపించగానే నేను కనెక్ట్ అయ్యానని రామలక్ష్మి అంటుంది. నీ బిహేవియర్ చూస్తుంటే రామలక్ష్మి అనిపిస్తుంది. అలా చెప్పేలోపే కాదు మైథిలీ అంటున్నావని సీతాకాంత్ అనుకుంటాడు.

Brahmamudi : రుద్రాణి ప్లాన్ ఫెయిల్.. ఇబ్బందిగా ఉందని చెప్పిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -686 లో.. రాజ్ తో కావ్య అలా పరాయిదానిలాగా మాట్లాడడం భరించలేకపోతుంది. నేను మళ్ళీ కలుస్తానంటూ అక్కడ నుండి వెళ్లిపోతుంది. కావ్య వెళ్ళిపోగానే యామిని వస్తుంది. బావ కాఫీ తాగుదామా అంటుంది. వద్దు నేను వెళ్తున్నానంటూ రాజ్ వెళ్ళిపోతాడు. మరొకవైపు యామిని గురించి అప్పు ఎంక్వయిరీ చేయిస్తుంది. అందరు హాల్లో కూర్చొని ఉంటారు. నాకు కావ్య మాటలతో ఆశ కలుగుతుందని ఇందిరాదేవితో అపర్ణ అంటుంది. కావ్య తనలో తను మాట్లాడుకుంటున్న వీడియోని రుద్రాణి అందరికి చూపించాలనుకుంటుంది. అందరి దృష్టిలో కావ్యని పిచ్చిదాన్ని చెయ్యాలనుకుంటుంది.

భర్తకు పనిష్మెంట్ ఇచ్చిన అనసూయ

బుల్లితెర మీద అనసూయ గురించి అందరికీ తెలుసు. ఫైర్ బ్రాండ్ అని. ఐతే ఆమె భర్త భరద్వాజ్ గురించి ఎవరికీ తెలీదు. కానీ నెక్స్ట్ వీక్ వచ్చే ఫామిలీ స్టార్స్ షోలో ఆ విషయం తెలియబోతోంది. ఆయనొక సెటైరికల్ కామెడీ పర్సన్ అని. శ్రీరామనవమి సందర్భంగా ఫామిలీ స్టార్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో అనసూయ గోల్డెన్ కలర్ చీరలో తన భర్త భరద్వాజ్ తో కలిసి వచ్చింది. అలాగే ఈ షోకి ఆట సందీప్ - జ్యోతిరాజ్, శ్రీవాణి - విక్రమాదిత్య, లాస్య - మంజునాథ్, జ్యోతక్క - గంగూలీ, సిద్దార్ధ్ వర్మ - విష్ణు జోడీస్ వచ్చారు. ఇక ఇందులో వీళ్ళు అడిగిన ప్రశ్నలకు అనసూయ భరద్వాజ్ బాగా ఆన్సర్స్ ఇచ్చారు. "ఎందుకు కుకింగ్ అంటే ఆడాళ్లే చేయాలి" అని జ్యోతక్క అడిగింది. దానికి అనసూయ " ఖైదీలకు ఫుడ్ పెట్టే బాధ్యత జైలర్ దే కదా.

రోహిణి చదువులో ఎంతో గ్రేట్... తలెత్తుకునేలా చేసింది

కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కాలేజీ స్పెషల్ పేరుతో ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఇక ఈ షోకి ఒక స్పెషల్ గెస్ట్ గా ఒక ప్రొఫెసర్ వచ్చారు. రావడంతో లేడీ కమెడియన్ రౌడీ రోహిణి లేచి నిలబడింది. ఆయన ఎవరో కాదు రోహిణికి చదువు చెప్పిన ప్రొఫెసర్ అన్న విషయం అర్థమైపోతుంది. ఆయనకు రోహిణి వినమ్రంగా రెండు చేతులు జోడించి నమస్కరించింది. ఆయన రాగానే "షీ కంప్లీటెడ్ డిప్లొయ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్.. ఒక స్టూడెంట్ గా చూసాను. ఇప్పుడు ఈ స్టేజి మీద చూడడం నిజంగా ఒక ప్రౌడ్ మూమెంట్" అంటూ తన స్టూడెంట్ గురించి ఆ ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు.

సుధీర్ ఆ ఒక్కటి అడక్కు...ఆర్ అంటే ఎందుకు ఇష్టమో కూడా నాకు తెలుసు

హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే రంభ ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. ఏ సినిమాల్లోనూ నటించడం లేదు. ఫామిలీతో పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ కనిపిస్తోంది. ఐతే రంభ ఇప్పుడు బుల్లితెర మీద కనిపించబోతోంది. సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ షోలో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి రంభ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ షోకి ప్రతీ వారం అలనాటి  అందాల నాయకులను తీసుకొచ్చి వాళ్లకు సముచిత గౌరవాన్ని అందిస్తోంది. ఇక ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. రంభ రావడంతోనే యాంకర్ రవి పులిహోర కలిపాడు.. ఆర్ ఫర్ రవి , ఆర్ ఫర్ రంభ, ఆర్ ఫర్ రావిషింగ్ అనేసరికి రంభ వెంటనే సెటైర్ వేసింది.

అనసూయ ఒక్క ఛాన్స్...హైట్ చూస్తే కత్తిలా ఉన్నాడు..

 ​కిర్రాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్ క్లాస్ రూమ్ ఐతే అందులో స్టూడెంట్స్ ఎలా ఉంటారు అనేది నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ చూపించబోతున్నారు. కాలేజ్ స్పెషల్ థీమ్ లో భాగంగా కొన్ని స్కిట్స్ వేశారు. ఐతే ఇందులో యాదమ్మ రాజు - అనసూయ మధ్య ఒక స్కిట్ నడిచింది. "మీలాంటి అమ్మాయి ఎదురుగా ఉంటే ఒక్క స్టెల్లాని ఏమిటి ఈ ప్రపంచాన్నే ఎదిరిస్తా...ఒక్క చాన్సు ఇస్తే మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా మేడం " అంటూ అనసూయ గురించి ఒక హార్ట్ టచ్చింగ్ డైలాగ్ చెప్పాడు. దానికి అనసూయ ఫిదా ఐపోయింది కానీ తర్వాత ఇంకో డైలాగ్ వేసింది. "సరిపోను రాజు" అంటూ అనసూయ నవ్వేసింది.

Illu illalu pillalu : పెళ్ళికి ముందే పది లక్షలు అడిగిన శ్రీవల్లి.. భాగ్యం ప్లాన్ అదే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ', ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-122 లో.....భాగ్యం చెప్పినట్టుగా చందుకి శ్రీవల్లి ఫోన్ చేసి మీతో మాట్లాడాలి.. త్వరగా రమ్మని చెప్తుంది సరేనని చందు బయలుదేర్తుంటే సాగర్, ధీరజ్ వచ్చి చందుని ఆటపట్టిస్తారు. ఎక్కడికి వెళ్తున్నావని అడుగగా.. శ్రీవల్లి రమ్మంది ఏదో మాట్లాడాలని చెప్పిందని చందు చెప్తాడు. సరే మేం కూడ వస్తామని సాగర్, ధీరజ్ లు వెళ్ళబోతుంటే అప్పుడే తిరుపతి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారని అడ్డుపడతాడు. శ్రీవల్లి దగ్గరికి అని చెప్పి వెళ్ళిపోతారు.