నాకు 44 ...రేపోమాపో పోతాను..ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకు గాలి, నీరు అవసరం
అడవి అంటే చిన్నప్పుడు చెప్పుకున్న చందమామ కథలే గుర్తొస్తాయి.. అడవిలో ఉండే పక్షులు, పశువులు, జింకలు, లేళ్ళు, నెమళ్ళు, చిలకలు వాటి గురించి విన్నప్పుడు మనం కూడా అలా స్వేచ్ఛగా ఉంటె బాగుంటుంది కదా అని అనుకోని పిల్లలు, పెద్దలు ఎవరూ ఉండరు. కానీ ఇప్పుడు అలాంటి ఒక అడవి ఆపదలో పడింది. నెమళ్ళ హాహాకారాలు చేస్తున్న వీడియో చూస్తున్న గుండెలు పగిలిపోయేంత బాధాగా ప్రతీ ఒక్కరూ కన్నీళ్లు పెడుతున్నారు. అదే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నా విషయం మీద సినీ సెలబ్రిటీస్ అంతా గళం విప్పుతున్నారు. రష్మీ దీని గురించి మాట్లాడగా ఇప్పుడు రేణు దేశాయ్ చెప్పిన మాటలు వింటే ఉఫ్...ఎవరికైనా మనసు చలించక మానదు. "ఒక తల్లిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఎలాగో నా వయసు 44 ..రేపో మాపో పోతాను. కానీ నా పిల్లలు ఉన్నారు. వాళ్ళ లాంటి పిల్లలు ఎందరో ఉన్నారు.