బెజవాడ బేబక్క : నేనూ పచ్చళ్ళు చేస్తా..ఫేమస్ అవుతా
కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ.. పచ్చళ్ళు, బూతులు, పనికిమాలిన కోతలు కాదేది ఫేమస్ కావడానికి అనర్హం అని అంటోంది ఇప్పటి సోషల్ మీడియా. పచ్చళ్ళ టాపిక్ కొన్ని రోజుల పాటు ఎలా ఫేమస్ అయ్యిందో అందరం చూసాం. ఇక ఇప్పుడు బెజవాడ బేబక్క కొత్త నిర్ణయం తీసుకుంది...పచ్చళ్ళ టాపిక్ డైవర్ట్ అవుతున్న టైములో మళ్ళీ అదే టాపిక్ ని తీసుకొస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోని పోస్ట్ చేసింది. "నేను కూడా పచ్చళ్ళు చేసి ఫేమస్ అవుదామనుకుంటున్నాను. వంకాయ రొయ్యల పచ్చడి..స్వయానా నేనే వేయించాను. అదిగో వేయించిన నూనె కూడా ఉంది.