English | Telugu
Karthika Deepam2: ఆవేశంగా తాత దగ్గరికి వెళ్ళిన దీప.. జ్యోత్స్న కన్నింగ్ ప్లాన్!
Updated : Apr 11, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-328 లో.. కాంచన, అనసూయలు.. శివనారాయణకు చాలా నచ్చజెప్పడానికి ట్రై చేస్తారు. ఆ గౌతమ్ మంచివాడు కాదు.. అతడితో జ్యోత్స్న పెళ్లి చేయొద్దని వాళ్ళు చెప్తుంటే.. శివనారాయణ మాత్రం వినడు. ఏది ఏమైనా ఈ పెళ్లి జరిగి తీరుతుందని శివనారాయణ చెప్పేసి లోపలికి వెళ్లిపోతాడు. తర్వాత సుమిత్ర, పారిజాతం ఇద్దరిని కూడా కాంచన బతిమిలాడుతుంది. సుమిత్ర వినకపోగా.. పారిజాతం మాత్రం.. తనకు నిజం తెలిసినా తెలియనట్లు నటిస్తూ మాటలు అనేస్తుంది. ఇక నిస్సహాయంగా ఏడ్చుకుంటూ అనసూయ, కాంచన తిరిగి బయలుదేర్తారు. ఇక కాంచన వాళ్లు వెళ్ళగానే జ్యోత్స్న దగ్గరికి పరుగుతీస్తుంది పారిజాతం.
మరోవైపు అనసూయ, కాంచన ఇంటికి వస్తారు. అక్కడ జరిగిందంతా దీపకి చెప్తారు. ఈ పెళ్లి జరగకూడదు.. నీకు నష్టం జరగకూడదు.. ఏదొకటి చెయ్ దీపా అనేసి కాంచన వెళ్లిపోతుంది. భర్త కోసం పోరాడిన సతీ సావిత్ర కథ గుర్తుందిగా.. అలానే నువ్వు పోరాడు అని దీపకి అనసూయ ధైర్యం ఇస్తుంది. పెళ్లి ఆగాలంటే జ్యోత్స్న నోటితోనే నిజం చెప్పించాలి.. నా మీద పడిన నింద పోతుందని దీప కోపంగా ఇంటి నుండి బయల్దేరుతుంది. మరోవైపు జ్యోత్స్న దగ్గరికి వెళ్ళిన పారిజాతం.. కాంచన, అనసూయ లు వచ్చిన సంగతి చెప్తుంది. జాగ్రత్తగా ఉండు, ఆ దీప దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయోనని జ్యోత్స్నకి పారిజాతం చెప్తుంది. ఇక జ్యోత్స్న వెంటనే దీపకి కాల్ చేస్తుంది. ఇక దీప ఫోన్ లిఫ్ట్ చేసి.. పది నిమిషాలు ఆగు ఫోన్లో కాదు డైరెక్ట్‌గా మాట్లాడుకుందామని అంటుంది. ఇంటికి వస్తున్నావా అని జ్యోత్స్న అడుగగా.. ఏం ఆపుతావా? అని దీప అంటుంది. నా పెళ్లి ఆపడానికి మా అత్తను పంపించడానికి సిగ్గులేదా అని జ్యోత్స్న అనగానే.. అన్నింటికీ సమాధానం చెప్పడానికే వస్తున్నానని దీప అంటుంది. మళ్లీ ఛీ అనిపించుకుంటావని జ్యోత్స్న అంటుంది. నువ్వు సత్తిపండు గాడ్ని తీసుకొచ్చి గౌతమ్ గాడ్ని కాపాడటానికి నేనేం రమ్యను తీసుకుని రావడంలేదు జ్యోత్స్నా అని దీప అనగానే.. ఏం మాట్లాడుతున్నావని జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇక దీప వార్నింగ్ ఇచ్చి వస్తున్నా అంటూ కాల్ కట్ చేస్తుంది.
మరోవైపు ఇంటికి వచ్చిన కార్తీక్.. దీప కోసం చూస్తాడు. తను లేకపోయేసరికి ఏం జరిగిందో చెప్పమని అనసూయ, కాంచనలని నిలదీస్తాడు. ఇక వాళ్ళిద్దరు జరిగిందంతా చెప్తారు. కావేరీ చాటుగా జ్యో, పారుల మాటలు విన్న దగ్గర నుంచి దీపను కాంచన కోరిన కోరిక వరకు అంతా చెప్తారు. అంతా విన్న కార్తీక్ బిత్తరపోతాడు. ముందు నిజం తెలియగానే నాకు చెప్పకుండా మీకు చెప్పడం దీప తప్పు కాదా.. కావేరీ చిన్నమ్మ నాతో షేర్ చేసుకోకపోవడం తప్పు కదా.. మీరే దీపను బలి పశువుని చేస్తున్నారు.. నాకు ముందు నుంచి జ్యోత్స్న మీద నమ్మకం లేదు.. తను మారిందని దీప చెప్పినా నేను నమ్మలేదంటూ కార్తీక్ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.