English | Telugu
Eto Vellipoyindhi Manasu : మైథిలీ కాదని నిరూపించడం కోసం సీతాకాంత్ ప్లాన్.. నిజం తెలుసుకున్న రామలక్ష్మి!
Updated : Apr 10, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -374 లో.... రామలక్ష్మి సీతకాంత్ ఇద్దరు ఒకే ప్లేట్ లో భోజనం చేస్తుంటారు. వాళ్ళని చూసి ఆ పెద్దావిడ, తన భర్త మురిసిపోతారు. ఇద్దరు భోజనం చేస్తారు తర్వాత సీతాకాంత్ పక్కకి వచ్చి తను మైథిలి అయితే నాతో కలిసి అలా ఒకే ప్లేట్ లో భోజనం ఎలా చేస్తుంది. ఖచ్చితంగా తను నా రామలక్ష్మినే ఎలాగైనా తాను బయటపడేలా చెయ్యాలనుకుంటాడు. తన ఫ్రెండ్ కి కాల్ చేసి కొంతమంది రౌడీలని పంపించు నన్ను కొట్టమని చెప్పమని చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు వెళ్తుంటే ఆ పెద్దవాళ్ళు వాళ్ళని ఆశీర్వదించి పంపిస్తారు.
ఇద్దరు వెళ్తుంటే కొంతమంది రౌడీలు వస్తారు. సీతాకాంత్ తో గొడవ పడుతుంటాడు. వీళ్ళు నా మనుషులే కదా అని సీతాకాంత్ ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాడు కానీ వాళ్ళు తన ఫ్రెండ్ పంపించిన రౌడీ లు కాదు.. అప్పుడే తన ఫ్రెండ్ కాల్ చేసి మా వాళ్ళు ఫుల్ గా తాగి పడుకున్నారు.. రావట్లేదని చెప్తాడు. దాంతో సీతాకాంత్ ఈ రౌడీలని కొడతాడు. రామలక్ష్మి దగ్గరికి వెళ్లి తప్పుగా మాట్లాడుతుంటే వాళ్ళని కొడతాడు. రౌడీ లు సీతాకాంత్ ని కత్తితో పొడిచినట్లు సీతాకాంత్ ని ఆ సిచువేషన్ లో చూసి రామలక్ష్మి నేనే మీ రామాలక్ష్మి అని నిజం చెప్పినట్లు సీతాకాంత్ కల కంటాడు. హలో సీతా గారు అని రామలక్ష్మి అంటుంటే.. అప్పుడు ఉహలో నుండి తేరుకొని ఇదంతా కలనా అని డిస్సపాయింట్ అవుతాడు. రౌడీ లు వచ్చినప్పుడు రామలక్ష్మి ఆ పెద్దావిడ వాళ్ళని పిలిచానని రామలక్ష్మి చెప్తుంది.
అప్పుడే తన ఫ్రెండ్ కాల్ చేసి రౌడీ లని పంపమంటావా అని అడుగుతాడు. నా ప్లాన్ ఫెయిల్ చేసావని ఫోన్ లో సీతాకాంత్ తన ప్లాన్ గురించి చెప్తుంటే రామలక్ష్మి వింటుంది. ఇక మీరు మారరా.. నేను మైథిలి అని చెప్తున్నా వినిపించుకోవడం లేదని కోపంగా వెళ్ళిపోతుంది. మరొకవైపు అసలు ఈ మైథిలి సీతా బావ ఎక్కడ వెళ్లినట్లు అని శ్రీలత తో శ్రీవల్లి అంటుంది. అప్పుడే సీతాకాంత్ డల్ గా వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.