English | Telugu

మెమరీ పవర్ తగ్గిపోయింది..ఇక రిటైర్ అవ్వండి

రష్మీ రిటైర్ కావాల్సిన టైం వచ్చిందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూఎన్సర్. శ్రీదేవి డ్రామా కంపెనీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో భలే సందడి చేసింది. ఐతే ఈ ఎపిసోడ్ కి సోషల్ మీడియా ఇన్ఫ్లూఎన్సర్ పూలచొక్కా అనే అతను వచ్చాడు. రాగానే అతని మ్యానరిజమ్ తో చేతులు తిప్పుతూ మాట్లాడాడు. టొమాటోస్ బుట్టను పట్టుకొచ్చాడు. రాగానే హాయ్ గైస్ నేను సినిమాలకు టొమాటోస్ ఇస్తూ ఉంటాను. కానీ ఫర్ ఏ చేంజ్ నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి టొమాటోస్ ఇస్తాను...అంటే ఈ షోలో ఉన్న ఆర్టిస్టులకు టొమాటోస్ ఇవ్వబోతున్నాను అన్నాడు. అతని చేతులు తిప్పే మ్యానరిజాన్ని ఇమిటేట్ చేశారు ఆది, పంచ్ ప్రసాద్. బులెట్ భాస్కర్ కి టొమాటోస్ ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పేసరికి ఆయనకు టొమాటోస్ కాదు గుడ్లు కూడా విసిరేయాలి అన్నాడు ఆది.

ఇంతలో ప్రసాద్ అతని దగ్గరకు వెళ్ళాడు. "నాకు మీ స్కిట్స్ అంటే చాలా ఇష్టం " అన్నాడు పూలచొక్కా . తర్వాత పూలచొక్కా అని పేరు పెట్టుకుని గళ్ళ చొక్కా వేసుకొచ్చావేంటి అని అడిగాడు. ఆ తర్వాత రష్మీని పిలిచి "నేను మీ యాంకరింగ్ చూస్తున్నాను...క్లోజ్లీ అబ్జర్వింగ్ అంటూనే కాకపోతే కొంచెం మెమరీ పవర్ తగ్గింది మీకు. రిటైర్ కావడానికి మీకు ఇదే మంచి సమయం" అంటూ పుసుక్కున రష్మీ పరువు తీసేసాడు. అసలు అంత సడెన్ గా రిటైర్ అన్న పదం అతని నోటి నుంచి విన్న రష్మీ పాపం ఎం చెప్పాలో తెలీక చాలా ఫీలయ్యింది. పూలచొక్కా వేసిన ఈ డైలాగ్ కి నెటిజన్స్ ఐతే ఆమెకు రిటైర్మెంట్ అవసరం లేదు కానీ తెలుగు నేర్చుకుంటే చాలు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.