English | Telugu

Brahmamudi: రాజ్ ని చూసేసిన దుగ్గిరాల కుటుంబం.. అతను కాదని కావ్య చెప్పనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-689 లో.. ఇంట్లో కావ్య పూజ చేసి అందరికి హారతి అందిస్తూ.. అత్తయ్యా మీరంతా ఇంకా రెడీ కాలేదా అని అంటుంది. ఎందుకమ్మా అని ఇందిరా దేవి అనగానే.. అదేంటి అమ్మమ్మా ఈ రోజు శ్రీరామనవమి కదా.. మనం అంతా గుడికి వెళ్లి పూజలు చేయించే వాళ్లంగా అని కావ్య అంటుంది. ప్రతి సంవత్సరం అంటే రాజ్ చేతుల మీదుగానే చేయించేవాళ్లం. లాస్ట్ ఇయర్ మా వదిన గొప్పలకు పోయి నా కొడుకు కోడలు అంటూ మీ ఇద్దరి చేత ఆ పూజలు చాలా గ్రాండ్‌గా జరిపించింది.. ఇప్పుడు రాజ్ లేకుండా ఆ గుడికి వెళ్తే నీ కొడుకు ఎక్కడా అని అక్కడి వాళ్లు అడిగితే వదిన ఏమని సమాధానం చెబుతారని రుద్రాణి అంటుంది. ఆ సమాధానాలు ఏవో నేను చెప్పుకుంటాను.. గుడిలో పూజారి గారికి మనం వస్తున్నట్లు చెప్పేశాను. మనం కూడా అక్కడికి వెళ్దామని కావ్య అంటుంది. వెంటనే రుద్రాణీ.. ఎందుకు రాజ్ బతికే ఉన్నాడని మమ్మల్ని పిచ్చివాళ్లను చేసినట్లు అక్కడి వాళ్లని కూడా పిచ్చివాళ్లను చేయడానికా.. మేమంటే ఇంట్లో వాళ్లం.. బయటి వాళ్లకు ఆ కథలు చెబితే నమ్మరు.. పిచ్చదానివి అనుకుంటారని రుద్రాణి అంటుంది.

Illu illalu pillalu: కూతురు కోసం నగలు తెచ్చిన రేవతి‌.‌. గీత దాటిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-126 లో.. చందు ఎంత మందికి ఫోన్‌లు చేసి డబ్బులు అడిగినా కూడా ఎవ్వరూ ఇవ్వరు. దాంతో శ్రీవల్లికి చందు కాల్ చేసి.. సారీ అండీ.. ఈ మాట మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.. ఎంత ప్రయత్నించినా కూడా డబ్బులు అడ్జెస్ట్ కావడం లేదని అంటాడు. ఆ మాట విని శ్రీవల్లి.. అయ్య బాబోయ్ అదేంటి బావా.. ఒకేసారి అంత పెద్ద బాంబ్ పేల్చారు.. ఒకవైపు పెళ్లికి టైమ్ దగ్గర పడుతుంది. ఇప్పుడు డబ్బులు లేవంటే ఎలా బావా? అని అడుగుతుంది. నేనూ అదే టెన్షన్ పడుతున్నాను.. నా వరకూ చాలా ప్రయత్నించాను కానీ నా వల్ల కావడం లేదు. అంత డబ్బు ఎవరు ఇవ్వడం లేదు. అందుకే ఈ విషయం మీ వాళ్లకి చెప్పి ఏదో విధంగా ట్రై చేయమను. మీ నాన్న ఎలాగూ ఫైనాన్స్ బిజినెస్‌లోనే ఉన్నారు కదా.. ట్రై చేయమను అని చెప్పేసి చందు ఫోన్ పెట్టేస్తాడు. దాంతో తన తల్లి భాగ్యాన్ని పిలిచి విషయం చెప్తుంది శ్రీవల్లి. మన ఆశలపై నీళ్లు చల్లేశారు.. నీ ప్లాన్‌పై పిడుగుపడింది.. బావ ఫోన్ చేశాడు.. డబ్బులు దొరకడం లేదట.. మనల్నే చూసుకోమన్నాడని అంటుంది. ఆ మాట వినగానే భాగ్యం గుండెల్లో రాయి పడిపోతుంది. చేప కోసం గాలం వేస్తే.. గాలం కూడా చేప మింగినట్టు.. ఒకేసారి మన ప్లాన్‌లు ఇలా ఫెయిల్ అవుతున్నాయ్ ఏంటని భాగ్యం అంటుంది.

Karthika Deepam2: ఏకమైన కార్తిక్, దీప.. గౌతమ్ వార్నింగ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-325 లో... ముందే ఈ శుభవార్తను జ్యోత్స్నకు చెప్పి దాని మనసు చెడగొట్టడం దేనికీ.. గౌతమ్ పేరెంట్స్‌తో కూడా మాట్లాడి, వాళ్లు ఓకే అన్నాక ముహూర్తాలు పెట్టాక దానికి చెబుదామని సుమిత్ర అంటుంది. ఈ పెళ్లి అనుకుంటే ఆ దీప చెడగొడుతుందేమో.. పెళ్లికి కూడా వచ్చి గొడవ చేస్తుందేమోనని పారిజాతం అంటుంది. అలా చేస్తే పోలీసులకు పట్టిస్తానంటాడు శివనారాయణ. సరే అయితే ఇక మనం పెళ్లి ఏర్పాట్లకు గౌతమ్ పేరెంట్స్‌తో మాట్లాడదామని ఆ నలుగురు నిర్ణయించుకుంటారు. అయితే అంతా పైనుంచి చాటుగా విన్న జ్యోత్స్న.. అసలు ఆ గౌతమ్ గాడు ముందు దీప సంగతి చూడకుండా ఇలా తగులుకున్నాడేంటీ.. ముందు వీడికి పెళ్లి కావాల్సి వచ్చిందా.. వాడు ఎలాంటి వాడో తెలిశాక వాడ్ని నేనెందుకు పెళ్లి చేసుకుంటా.. బావతోనే నా పెళ్లి జరగాలి.. దీప అడ్డు తొలగాలి.. ఆ దీప పోవాలంటే ఆ ఇంట్లో ఏదొక గొడవ జరగాలి ఎలా అని రగిలిపోతుంది.

శ్రీముఖి ప్లీజ్ డాన్స్ చేయొద్దు..మా ఆయన నీ డాన్స్ చూసి మెస్మోరైజ్ ఐపోతున్నాడు

  శ్రీరామనవమి పండగ స్పెషల్ కాన్సెప్ట్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం రాబోతోంది. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఇష్మార్ట్ జోడీస్ ఎంట్రీ ఇచ్చారు. రాకేష్ - సుజాత, యష్ - సోనియా, ప్రేరణ - శ్రీపద్, ప్రదీప్ - సరస్వతి, లాస్య - మంజునాథ్ వీళ్లంతా వచ్చారు. వీళ్ళతో టాస్కులు ఆడించింది శ్రీముఖి. ఐతే ఇందులో ఒక టాస్క్ లో నేల మీద ఒక క్లాత్ వేసి దాని మీదనే వైఫ్ అండ్ హజ్బెండ్ ని నిలబెట్టి డాన్స్ చేయించింది. ఇకపోతే  సోనియా శ్రీముఖిని పాపం  ఒక రిక్వెస్ట్ చేసింది. "శ్రీముఖి గారు నా నుంచి ఒక రిక్వెస్ట్ మీరు అంత మంచిగా డాన్స్ చేయొద్దు...యష్ మీ డాన్స్ ని చూసి మెస్మోరైజ్ ఐపోయాడు..సో" అని చెప్పుకొచ్చింది.

ఛ..నన్నెవరూ కమిట్మెంట్ అడగలేదు.. ఒకవేళ అడిగితే ఎలా ఉంటుందో ?

బుల్లితెర మీద జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అష్షురెడ్డి. ఐతే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కమిట్మెంట్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. "కమిట్మెంట్ ఎలా వర్క్ అవుతుందో నాకు ఇంత వరకు తెలీదు. కానీ అడిగితే ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనే దురద కూడా నాకు ఉండేది. ఐతే ఇప్పటి వరకు నాకు అలాంటి సందర్భం ఎదురు కాలేదు..బహుశా నేను అంతలా ఎదగలేదేమో అడగడానికి. ఇప్పుడు చాలామంది వచ్చామా, పని చేసుకున్నామా , వెళ్ళిపోయి పడుకున్నామా అనేవాళ్లే ఉన్నారు. నా మీద ఎలాంటి నెగటివ్ కామెంట్స్ వచ్చినా నేను పట్టించుకోను. అరుణాచల  శివుడి దగ్గరకు వెళ్లాం నేను నా ఫ్రెండ్ కలిసి...అక్కడి నుంచి వచ్చాక  నేను చాలా మారాను. శివుడు ఉన్నాడు చూసుకుంటాడు అనిపిస్తుంది.

రంభకు ప్రపోజ్ చేసిన రోబో...

సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో భలే క్యూట్ గా ఉంది. ఈ షోకి రంభ, జెడి.చక్రవర్తి జంటగా వచ్చారు. రంభ రావడమే ఎప్పుడెప్పుడు ప్రొపోజ్ చేద్దామా అన్నట్టుగా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అందులో ఒక రోబో కూడా రెడీ ఐపోయి మరీ వచ్చింది. "ప్రపంచంలో నచ్చినవి రెండే రెండు. ఒక నేను ఒకటి మీరు" అంటూ చిట్టి ది రోబో వచ్చి రంభకి మెరిసే కళ్ళతో ప్రొపోజ్ చేసేసరికి రంభ కూడా ముద్దులిచ్చేసింది. తర్వాత చామంతి సీరియల్ టీం నుంచి ఆశిష్ వచ్చి రోబో కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నాను అంటూ రంభకి గులాబీలు ఇచ్చి మరీ ప్రొపోజ్ చేసాడు.

 బర్డ్ ఫ్లూ వచ్చిన కోడిలా ఉంది అంటూ పరువు తీసేసిన ఆది

ఢీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో సోనియా సింగ్ మీద ఆది వేసిన పంచులు మాములుగా లేవు. "లంచు కోస్తావా మంచు కోస్తావా" అనే పాటలు పెట్టే బదులు మంచి మెడ్లే సాంగ్స్ పెట్టొచ్చుగా" అంది సోనియా. దానికి ఆది " ఈ ఇడ్లి అమ్ముకునే దానికి మెడ్లే కావాలా" అనేసరికి షాకైంది సోనియా. "ఆది నేను డైటింగ్ చేసి సన్నగా అయ్యాను" అంది సోనియా. "బర్డ్ ఫ్లూ వచ్చిన కోడిలా ఉంది" అనేసరికి తలతిప్పేసింది. ఇక ఇప్పుడు హోస్ట్ నందు వంతు వచ్చింది. "చిలకలాగా భలే ఎనర్జిటిక్ గా ఉంటుంది సోనియా తెలుసా..నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా సోనియా "అని అడిగాడు. "లేదు జస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి" అనేసింది సోనియా. మళ్ళీ నందు "సడెన్ గా ఎలా మారిపోయావు" అన్నాడు డౌట్ తో..వెంటనే ఆది రియాక్ట్ అయ్యాడు.

Illu illalu pillalu: పెళ్ళి పనుల్లో రామరాజు ఫ్యామిలీ.. మరి విశ్వ ఎత్తుగడ ఏంటి?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-124లో..  అన్నదమ్ములు ముగ్గురూ రెస్టారెంట్‌కి వెళ్తారు. అయితే చందు శ్రీవల్లి అడిగిన పది లక్షల గురించే ఆలోచిస్తుండు. అది చూసిన ఇద్దరు తమ్ముళ్లు.. ఏంటి అన్నయ్యా వదినతో ఏదో సీక్రెట్‌గా మాట్లాడుతున్నావ్.. ఇంతకు ముందు ప్రతి చిన్న విషయం మాతో చెప్పేవాడివి.. పెళ్లి కుదరగానే ఎంత మారిపోయావ్ అన్నయ్య అని ధీరజ్, సాగర్ ఇద్దరు అంటారు. చందు మాత్రం అలా ఆలోచిస్తూనే ఉంటాడు. ఏమైందిరా.. దేనికో టెన్షన్ పడుతున్నావ్.. ఏమైందని మళ్లీ అడుగుతారు. ఏం లేదురా నాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయని చందు అంటాడు. అన్నయ్యా.. ఆ రోజు నీ ప్రేమ విషయాన్ని మా దగ్గర దాచేసి నరకం చూశావ్.. మాతో కూడా చెప్పలేదు. కానీ నీకు మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదు. నీ మనసులో ఏ ప్రాబ్లమ్ ఉన్నా మాతో చెప్పు.. నీలో నువ్వు బాధపడకు. నాన్న చేతులపై ఈ పెళ్లి జరుగుతున్నందుకు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వొక్కడివే నాన్న మాటకి విలువ ఇచ్చావని చాలా సంతోషంగా ఉన్నారు. ఆ విలువను కాపాడుకోవాలిరా. ఇప్పటివరకు మన మధ్య ఎలాంటి దాపరికాలు లేవు. ఇకపై కూడా మనం అలాగే ఉందాం.. కాబట్టి చెప్పరా.. నువ్వు ఏ విషయంలో టెన్షన్ పడుతున్నావని చందుని ఇద్దరు అడుగుతారు.