English | Telugu

 హుక్ స్టెప్స్‌ వివాదం.. కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్ మాస్టర్!


టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ మాష్టర్ ఒక షోలో కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేశారు. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో అందులో హుషారుగా సాగుతోంది. జాతర అనే స్పెషల్ కాన్సెప్ట్ తో ఈ షో రాబోతోంది. ఐతే ఇందులో శేఖర్ మాష్టర్ ఏడ్చారు. శ్రీముఖి "మీరు చేసిన కోరియోగ్రఫీలో అద్భుతమైన పేరు వచ్చినప్పటికీ ట్రోలింగ్ కూడా బాగా జరిగింది" అని అడిగేసరికి శేఖర్ మాష్టర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాంతో శ్రీముఖి కూడా చాల బాధపడింది. "ఏ సాంగ్ ని ఎలా చేయాలో అలాగే చేస్తాం. అన్ని సాంగ్స్ ని ఒకేలా చేయము. ఈ సాంగ్ ఇలా చేయాలి. మాస్ సాంగ్ ఉంటె మాస్ సాంగ్, డ్యూయెట్ సాంగ్ ఉంటె ఇంకో లాగ, వేరే సాంగ్ కి వేరే లాగ..మీరు రాసేయటానికి, చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ నాకు నా వెనకాల నా వాళ్లకు" అంటూ పాపం వెక్కి వెక్కి ఏడ్చాడు. దాంతో అక్కడ సెట్ లో ఉన్న వాళ్లంతా కూడా ఆ మాటలకు చాలా ఫీల్ అయ్యారు. ఐతే శేఖర్ మాష్టర్ కోరియోగ్రఫీ కొంచెం శృతి తప్పింది అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ బ్యాక్ పాకెట్ లో హీరో చెయ్యి పెట్టి వేసే స్టెప్స్ మీద ఆ తర్వాత పుష్ప 2 లోని పీలింగ్స్ సాంగ్ కి , డాకు మహారాజ్ మూవీలోని దబిడి దిబిడి సాంగ్ మీద, అలాగే రాబిన్ హుడ్ మూవీలో అదిదా సర్ప్రైజు అనే సాంగ్ స్టెప్స్ మీద బాగా నెగటివిటీ వచ్చింది. ఈ మూవీలో కేతిక శర్మ హుక్ స్టెప్ మీద బాగా ట్రోలింగ్ జరిగింది. ఇలాంటి స్టెప్స్ ని ఎలా కంపోజ్ చేస్తారు అంటూ కూడా నెటిజన్స్ అడిగారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ ట్రోలింగ్ మీద కిర్రాక్ బాయ్స్ షోలో శ్రీముఖి అడిగింది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.