నా అకౌంట్ బ్లాక్ అయ్యింది...నా స్లీవ్‌లెస్ డ్రెస్ ఫొటోస్ పెట్టి కొత్త స్టోరీలు అల్లొద్దు
ప్రవస్తి ఆరాధ్య తాను పాడుతా తీయగా షోలో ఎదుర్కున్న ఎన్నో ఇష్యుస్ ని బయట పెట్టింది. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రోజూ ఏదో ఒక కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. అలాగే సునీత, కీరవాణి, చంద్రబోస్ వంటి లెజెండరీ సింగర్స్ మీద కూడా అలిగేషన్స్ చేసిన ప్రవస్తికి వాళ్ళు కూడా ఇన్డైరెక్ట్ గా కౌంటర్లు ఇస్తున్నారు. అలాగే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. దానికి ప్రవస్తి కూడా ఊరుకోకుండా రికౌంటర్లు ఇస్తోంది. ఇప్పుడు ఇంకో పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "చాలా మంది నా స్లీవ్‌లెస్ డ్రెస్ ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ, అప్పుడు రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో నేను ఆ దుస్తులు వేసుకోమంటూ నన్ను ఎవరూ బలవంతం చేయలేదు, అది నా ఇష్టం మేరకు వేసుకున్నాను. మన ఇష్టానుసారం వేసుకోవడానికి అలాగే ఎవరైనా మనల్ని ఫోర్స్ చేసి వేసుకునేలా చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఐనా స్లీవ్‌లెస్ డ్రెస్సులు వేసుకోవడం వలన కలిగే సమస్యల గురించి నేను ఎక్కడా ప్రస్తావించలేదు.