Illu illalu pillalu : వీడియో కాల్ చేయమన్న నర్మద.. భాగ్యం బండారం బయటపడనుందా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -148 లో....శ్రీవల్లి చందు, వేదవతి, ప్రేమ , ధీరజ్ భాగ్యం ఇంటికి వస్తారు. ఇక వాళ్ళంతా రాగానే శ్రీవల్లిని హగ్ చేసుకుంటుంది భాగ్యం. నేను చెప్పినట్లు నగలు తీసుకొని వచ్చావా అని అడుగుతుంది. తీసుకొని వచ్చానని శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత భాగ్యం హారతి ఇచ్చి శ్రీవల్లి, చందులని ఆహ్వానిస్తుంది. అందరు లోపలికి వెళ్ళాక నర్మద, సాగర్ ఎందుకు రాలేదని భాగ్యం అడుగుతుంది. వదినకి లీవ్ ఇవ్వలేదని అమూల్య చెప్తుంది.