English | Telugu

మీరు గౌరవించరు కానీ మా మీద వేలెత్తి చూపిస్తారు

సింగర్ ప్రవస్తి ఇప్పుడు న్యూస్ లో హాట్ టాపిక్ గా ఉన్న అమ్మాయి. పాడుతా తీయగా షో గురించి అందులో ఉన్న జడ్జెస్ గురించి హాట్ కామెంట్స్ చేస్తూ రెగ్యులర్ గా టాప్ ప్లేస్ లో ఉంటోంది. ఐతే ఈమె కీరవాణి, సునీత, చంద్రబోస్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది. దానికి సునీత కూడా వీడియోస్ రూపంలో అలాగే ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ లో మెసేజెస్ పెడుతూ కొంత రివర్స్ ఎటాక్ ఇస్తూ వస్తోంది. రీసెంట్ గా కూడా సింగర్ సునీత ఒక పోస్ట్ పెట్టింది. "ఇక్కడ మానిప్యులేషన్ ఎక్కువగా ఉంది. వాళ్ళు ఎదుటి వాళ్ళతో రెస్పెక్ట్ లేకుండా ప్రవర్తిస్తారు కానీ దాన్ని వాళ్ళు చెప్పకుండా ఎదుటి వాళ్ళ బిహేవియర్ గురించి మాత్రమే హైలైట్ చేస్తారు" అంటూ సునీత ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ప్రవస్తి గురించి పెట్టిందనే విషయం అందరికీ అర్ధమవుతోంది అంటూ నెటిజన్స్ అంటున్నారు. అలాగే మానిప్యులేషన్ అనే పదాన్ని రెడ్ మార్క్ తో పెట్టింది సునీత.

ప్రవస్తికి సునీతకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది ఒకరు కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తుంటే ఇంకొకరు ఇలాంటి పోస్టులు పెడుతున్నారు అంటూ నెటిజన్స్ అంటున్నారు. ఇక ఈ వివాదంలోకి కోటి, సింగర్ గీతా మాధురి వచ్చి కీరవాణి, సునీత, చంద్రబోస్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అలాగే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ మీద కూడా ప్రవస్తి కొన్ని విషయాలు మాట్లాడింది. దానికి వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు. ప్రవస్తి వాళ్ళ అమ్మ తనతో మర్యాదగా ప్రవర్తించలేదని, కొరకొరా చూశానంటూ అబద్దం చెప్తోంది అంటూ సునీత కూడా కౌంటర్ ఇచ్చారు. ఇలా రోజూ ఎదో ఒక అంశం మీద వీళ్ళ మధ్య ఒక టాపిక్ నడుస్తోంది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.