Brahmamudi : ఒక్కటైన యామిని, రుద్రాణి.. స్పృహకోల్పోయిన రాజ్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -717 లో..... రాజ్ కి గతం గుర్తుచేసే పనిలో భాగంగా అప్పు, కళ్యాణ్ ఇద్దరు రాజ్, కావ్య వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందని తమ స్టోరీలాగా చెప్తుంటే రాజ్ ఆసక్తిగా వింటాడు. నాకు తెలిసిన స్టోరీలాగా అనిపిస్తుందని రాజ్ అనుకుంటాడు. ఎక్కడ రాజ్ కి గతం గుర్తుకి వస్తుందోనని యామిని టెన్షన్ పడుతుంది. మరొకవైపు రాజ్ కి గతం గుర్తుకి రాకూడదని రాహుల్, రుద్రాణి పవర్ కట్ చెయ్యడానికి పవర్ మెయిన్ దగ్గరికి వెళ్తారు. పవరాఫ్ చేయబోతుంటే.. అప్పుడే యామిని కూడా పవరాఫ్ చేయబోతుంది.