అంత మంది చనిపోయారు అన్న చిన్న ఫీల్ కూడా లేదు ? నువ్వు సేఫ్ గానే ఉంటావులే
పహల్గాంలో పరిస్థితి అద్వానంగా ఉంటే ఆర్జే కాజల్ మాత్రం అక్కడంతా ప్రశాంతంగా ఉందని, రోడ్స్ అంతా క్లియర్ గా ఉన్నాయని..వాళ్లంతా సేఫ్ గా ఉన్నామంటూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. కాశ్మీర్ ట్రిప్ లో ఉన్నామని లేటెస్ట్ అప్ డేట్ ఇస్తున్నాను అంటూ పెహెల్గాం నుంచి శ్రీనగర్ కి వెళ్తున్నామని చెప్పింది. అంతా ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉంది అని చెప్పింది. తన గురించి ఆలోచన వెల్ విషర్స్ , ఫ్రెండ్స్ అంతా కాల్ చేస్తున్నారు, మెసేజెస్ పెడుతున్నారు. ఐతే అక్కడ తాను సేఫ్ గా ఉన్నాను అని చెప్పింది. అలాగే లోకల్ పోలీసులు కూడా అంతా జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెప్పింది. కాశ్మీర్ ఎప్పటిలానే సేఫ్ గా ఉంది.