English | Telugu

బామ్మా ఈ వయసులో ఈ కోరికలేంటి నీకు..


సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో ఐతే సూపర్ ఫన్నీగా ఉంది. ఈ ఎపిసోడ్ కి సిద్దార్థ్ వర్మ - విష్ణు ప్రియా, శివనాగ్ - మహేశ్వరీ, రవి కిరణ్ - సుష్మ కిరణ్ ఈ మూడు రియల్ జంటలు వచ్చాయి. రాగానే సుమ జామకాయల్లా కనిపించే ముంజెలు ఇచ్చింది. ఇక ఇందులో సుమ వీళ్లకు బామ్మగా మారింది. రీసెంట్ టైమ్స్ లో గొడవ పడింది ఎప్పుడు అని సుమ అడిగింది దానికి రవి కిరణ్ మధ్యాహ్నమే గొడవ పడ్డాం...షోకి వెళ్ళాలి టైం అవుతోంది అంటే ఇల్లు ఊడ్చాలి అంటూ కంప్లైంట్ చేశారు. తర్వాత విష్ణుప్రియ వచ్చి "కపుల్ ప్రోగ్రామ్స్ అంటే చాలా బాధ, భయం కూడా వాళ్ళు త్వరగా రెడీ ఐపోతారు..మేము రెడీ కావడానికి చాలా టైం పడుతుంది" అని పాపం బాధపడింది.

తర్వాత శివనాగ్మ నిహేశ్వరీ "సిట్టింగా" అంటూ కాసేపు ఏడిపించింది. దానికి అతను "ఇంటికి రావాలంటే ప్రశాంతత ఉండాలి. అందుకే బయట అక్కడక్కడా తాగేసి వస్తున్నా అన్నాడు" ఇంకా రవి కిరణ్ - సుష్మ కిరణ్ ఐతే పని మనిషి రావట్లేదు అన్న కాన్సెప్ట్ తో స్కిట్ వేసి నవ్వించారు. చివరికి సుమ బామ్మ గెటప్ వేస్తున్న అంటూ ముగ్గురినీ మనవాళ్ళు రండి అని పిలిచింది. దానికి సుమ కౌంటర్ వేసింది.."వీళ్లకు నేను బామ్మ గెటప్ వేస్తున్నాను అన్న ఆనందం ఎక్కువగా కనిపిస్తోంది" అని నవ్వుకుంది. ఫైనల్ గా ఒక టాస్క్ ఇచ్చింది. ఒక యాపిల్ ని గాల్లో వేలాడదీసి "చేతులతో పట్టుకోకుండా మీరిద్దరూ యాపిల్ పళ్ళను తినాలి" అనేసరికి రవి కిరణ్ " బామ్మా ఈ వయసులో నీకు ఇలాంటి కోరికలేంటో నాకు తెలియట్లేదు" అన్నాడు. తర్వాత నరసింహ మూవీ సీన్ రిక్రియేట్ చేయించింది. శివనాగ్ రజనీకాంత్ లా మహేశ్వరీ రమ్య కృష్ణలా సౌందర్య రోల్ ని బాబీతో చేయించింది. అదే స్కిట్ ని సిద్దార్థ్ వర్మ - విష్ణుప్రియ కూడా చేశారు. విష్ణు తన డాన్స్ తో అందరినీ ఆకట్టుకుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.