English | Telugu

మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించిన జానీ మాస్టర్

పహాల్గమ్ బాధితులైన మధుసూదన్ కుటుంబ సభ్యులను ఈరోజు ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాష్టర్ కుటుంబసభ్యులు వెళ్లి కలిశారు. మధుసూదన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ కుటుంబానికి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ తో పాటు తాను కూడా ఒక సోదరుడిలా అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. ఈ దేశ ఔన్నత్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని టెర్రరిస్టు మూకలు ఎప్పటికీ ఏమీ చేయలేవు అంటూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోని పోస్ట్ చేశారు. మన దేశంపై, మన ప్రజలపై జరిగే దాడులని కుల,మత,జాతి తేడాలు లేకుండా, అవసరమైతే ప్రతీ పౌరుడు ఒక సైనికుడిగా మారి ఎదుర్కోవాలి అంటూ పిలుపు ఇచ్చారు.

వాళ్ళు బాగుంటే చాలు  నేను చచ్చిపోయినా పర్లేదు..

బుల్లితెర మీద ట్రాన్స్ జెండర్ కమెడియన్ తన్మయి గురించి అందరికీ తెలుసు. క్యూట్ గా మంచి కామెడీ టైమింగ్ తో ఫుల్ జోష్ అండ్ ఎనర్జీతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఐతే ఆమె జీవితంలోని కష్టాలు వింటే ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే.. ఒక ఇంటర్వ్యూలో ఆమె చాలా ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పింది  "మూవీ ఆఫర్స్ వస్తున్నాయి కానీ డేట్స్ చెప్తాము అంటున్నారు  కానీ తర్వాత పట్టించుకోవడం లేదు. నేను ఒక ఛాన్స్ వచ్చింది అని పరిగెత్తను, రాలేదు అని డల్ ఇపోను. నా లైఫ్ లో నాకు కొత్త ఆశలు అంటూ ఏమీ లేవు..నా ఫామిలీని చూసుకోవాలి అంతే..వాళ్ళు బాగున్నారా అది చాలు నాకు..వాళ్ళు బాగుంటే చాలు నేను చచ్చిపోయినా పర్లేదు.వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్లే.. ఈవెంట్స్ చేస్తున్నాను , జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నాను.

ప్రభుదేవా ఫోన్ చేసి మెచ్చుకున్నారు...క్రెడిట్స్ కింద కొరియోగ్రాఫర్ పేరు ఉండదు

బుల్లితెర మీద డాన్స్ షోస్ కి ఎక్కువగా శేఖర్  మాస్టర్ జడ్జ్ గా వస్తూ ఉంటారు. ఆయన టాలీవుడ్ లో ఎన్నో సాంగ్స్ కి కొరియోగ్రాఫ్ చేశారు. ఐతే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. "కొరియోగ్రఫీ విషయంలో నాకు ఒకటి బాధ కలిగిస్తుంది. ఇంత కష్టపడి చేస్తే కొరియోగ్రాఫ్ చేస్తే ఒక డాన్స్ కి యూట్యూబ్ లో కానీ ఇంకెక్కడైనా కూడా క్రెడిట్స్ కింద కొరియోగ్రాఫర్ పేరు ఉండదు. అక్కడ చాలా బాధేస్తుంది. సాంగ్ రిలీజ్ చేసాక మ్యూజిక్ డైరెక్టర్ ది, పాడిన వాళ్ళ పేర్లు, రచయిత పేరు కూడా వేస్తారు కానీ కొరియోగ్రాఫర్ పేరు మాత్రం వేయరు. ఐతే కొందరు మర్చిపోతారేమో.. అదొక్క విషయంలోనే బాధగా ఉంటుంది.

Brahmamudi : రాజ్ బ్రతికే ఉన్నాడని తెలుసుకున్న దుగ్గిరాల కుటుంబం.. వారిద్దరికి తప్ప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -710 లో....కావ్య, యామిని ఇద్దరు గొడవపడతారు రాజ్ ని ఎలాగైనా నా సొంతం చేసుకుంటానని యామిని అంటుంది. అది నీ వల్ల కాదని ఇద్దరు ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత కళ్యాణ్ వెళ్తుంటే రాజ్ కార్ కి సైడ్ ఇవ్వబోయి కిందపడతాడు. చూసుకో బ్రదర్ అంటూ రాజ్ చెప్పి వెళ్తాడు. రాజ్ ని చూసిన కళ్యాణ్ అన్నయ్య అంటూ వెళ్ళబోతుంటే ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వచ్చి ఆపుతాడు. లైసెన్స్ ఉందా అంటూ విసిగిస్తాడు అన్ని చూపెట్టేలోపు రాజ్ వెళ్ళిపోతాడు.

ఇక్కడ 5 వేలు...అక్కడ 2 లక్షలు...టెక్నాలజీ అంటే ఇష్టం...

టాలీవుడ్ లో ఒకప్పుడు చక్రి ఆధ్వర్యంలో ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన కౌసల్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. "నీ కోసం" అనే మూవీతో ప్లే బ్యాక్ సింగర్ గా ఆమె కెరీర్ స్టార్ట్ చేసింది. క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా ఆమె అన్ని రకాల సాంగ్స్ పాడి అలరించారు. ఆ తర్వాత ఆమె ఇక పాడడం ఆపేసారు. రీసెంట్ గా ఇంటర్వ్యూలో సింగర్స్ రెమ్యూనరేషన్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు."ఫిలిం ఇండస్ట్రీ అనేది బిజినెస్. అందులో మన సౌత్ సైడ్ ఫిలిం ఇండస్ట్రీలో పేమెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ముంబైలో ఒక సింగర్ కి మినిమం 2 నుంచి 3 లక్షలు పే చేస్తారు. కానీ ఇక్కడ ఒక సింగర్ కి 5 వేలు మాత్రమే ఇస్తారు.

నేను ఉగ్రవాదిని కాను...నేను ఇండియన్ ని...

సోహైల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మంచి ఫేమ్ తెచ్చుకున్న కంటెస్టెంట్. అలాగే కొన్ని మూవీస్ లో నటించాడు. కళింగపట్నం అనే రెస్టారెంట్ ని స్టార్ట్ చేసాడు. రీసెంట్ గా ప్రపంచ యాత్రికుడు ఐన యూట్యూబర్ నా అన్వేషణ సోషల్ మీడియాలో సోహైల్, మెహబూబ్ తో పాటు కొంతమందిని ఉగ్రవాదులతో పోల్చుతూ ఒక వీడియో రిలీజ్ చేసాడు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్లందరినీ ఉగ్రవాదులు అంటూ కామెంట్ చేసాడు. దాని మీద సోహైల్ ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు.  "పహాల్గమ్ దాడికి బెట్టింగ్ యాప్స్ కి లింక్ పెట్టి నన్ను ఉగ్రవాది అని ముద్ర వేయడం ఏమిటి ? నన్ను ఉగ్రవాది అనేసరికి నేను చాలా హార్ట్ అయ్యాను.

మా ఇంట్లో వాళ్లకు అసలు గొడవలు పడదు..నిఖిల్ ప్లే చేసే గేమ్స్ వేరు

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఈ రాబోయే వారానికి "ఫామిలీ థీమ్" ఇచ్చింది శ్రీముఖి. దాంతో కంటెస్టెంట్స్ అంతా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ ని తీసుకొచ్చారు. రోహిణి వాళ్ళ నాన్నను తీసుకొచ్చింది. ఐతే శ్రీముఖి వచ్చి ఆయనకు షాక్ హ్యాండ్ ఇస్తుండగా రోహిణి నాన్నో అంటూ గట్టిగా పిచ్చిగా అరుస్తూ ఉంది. వెంటనే శ్రీముఖి షాకింగ్ ఫేస్ పెట్టి ఇందాకే కదవే కింద కలిశావ్ అప్పుడే డాడీ అని అరుస్తున్నావేంటి.. అవసరమా  అని అడిగింది. తర్వాత పృథ్వి శెట్టిని చూస్తూ "షూటింగ్ పేరుతో సగం టైం నువ్వు హైదరాబాద్ లోనే ఉంటావ్ ఇక ఫామిలీతో గడిపే టైం ఎక్కడ ఉంటుంది చెప్పు" అంది.

మా అమ్మే నాన్నలా నన్ను చూసుకుంది : గుప్పెడంత మనసు రిషి సర్

మదర్స్ డే స్పెషల్ గా "లవ్ యు అమ్మ" అనే షో త్వరలో స్టార్ మా ఆడియన్స్ కోసం రాబోతోంది. ఈ షోకి హోస్ట్స్ గా యాంకర్ రవి, విష్ణు ప్రియా వచ్చారు. "మన మొదటి ప్రేమ తన కౌగిలింత, మన మొదటి ముద్ద తన చేతి వంట..ఈరోజు ఈ స్టేజి అంతా అమ్మ ప్రేమతో నిండిపోతుంది" అంటూ ఇంట్రడక్షన్ ఇచ్చాడు రవి. ఈ షోకి గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముకేశ్ గౌడ, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్, బిగ్ బాస్ నుంచి ప్రేరణ, గౌతమ్ కృష్ణ, విజె సన్నీ, బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపికా ఇలా చాలామంది వచ్చారు. ఇక ఇమ్మానుయేల్ వాళ్ళ అమ్మ ఐతే విష్ణు ప్రియాకి కౌంటర్ ఇచ్చింది. "విష్ణు ప్రియా మేము మా పిల్లలతో వచ్చాము.