English | Telugu
Brahmamudi : సుభాష్ కి నిజం చెప్పేసిన కావ్య.. ఆ ఇద్దరి మధ్య ఛాలెంజ్!
Updated : Apr 30, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -708 లో..... కావ్య ఇంట్లో వాళ్ళు ఎవరు చూడొద్దని డోర్ వేస్తుంది కానీ రాజ్ వెళ్తుంటే రాజ్ కి సుభాష్ ఎదురుపడతాడు. రాజ్ ని చూసి సుభాష్ షాక్ అవుతాడు. అపర్ణ, అప్పు బయటకు వస్తారు. మరొకవైపు బావ ఇంకా రాలేదు అని యామిని జీపీఎస్ ఆన్ చేసి చూస్తుంది. లొకేషన్ రాజ్ ఇల్లు చూపించడంతో యామిని షాక్ అవుతుంది. రాజ్ వాళ్ళింటికి వెళ్ళిపోయాడని తన పేరెంట్స్ కి చెప్తుంది.
ఆ తర్వాత రాజ్ ని సుభాష్ చూస్తూ ఉంటాడు. మావయ్య తను రామ్.. నా ఫ్రెండ్ అని కావ్య కవర్ చేస్తుంది కానీ సుభాష్ మాత్రం బిత్తరపోయి చూస్తుంటాడు. హాయ్ అంకుల్ అని రాజ్ అనగానే.. సుభాష్ ఆశ్చర్యంగా చూస్తాడు. మీరు వెళ్ళండి రామ్ గారు అని రాజ్ ని పంపిస్తుంది కావ్య. అదంతా సుభాష్ కి ఏం అర్ధం కాదు. రాజ్ వెళ్లిపోతు వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తాడు. ఆ తర్వాత కావ్య అపర్ణ, అప్పు, సుభాష్ గదిలో మాట్లాడుకుంటారు. నాకు ఏం అర్థం అవ్వడం లేడని సుభాష్ అంటాడు. దాంతో కావ్య జరిగింది మొత్తం చెప్తుంది. తను మీ అబ్బాయి రాజ్ కానీ తనకి గతం గుర్తు లేదు అలా గతం గుర్తుచేసే ప్రయత్నం చేస్తే తనకి ప్రమాదం అంట అని కావ్య చెప్తుంది. ఇంత బాధపడుతుంటే నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదని సుభాష్ అడుగుతాడు. కొన్ని రోజులు ఆగితే అంత సెట్ అవుతుందని అపర్ణ, కావ్య అంటారు. సరేనని సుభాష్ అంటాడు.
నాకు రాజ్ కావాలి అని యామిని సైకో లాగా బెహేవ్ చేస్తుంది. అప్పుడే రాజ్ వస్తాడు. రాజ్ వస్తున్నాడు అంటే అతనికి గతం గుర్తురాలేదని యామిని వాళ్ళ నాన్న అంటాడు. రాజ్ రాగానే ఎక్కడికి వెళ్ళావ్ బావ అని యామిని అడుగుతుంది. బయటకు వెళ్ళానని రాజ్ అంటాడు. రాజ్ వెళ్ళిపోయాక అబద్ధం చెప్పాడని వాళ్లకు అర్ధం అవుతుంది. త్వరగా బావతో నాకు పెళ్లి జరగాలని యామిని అంటుంది. జరుగుతుందని తన పేరెంట్స్ అంటారు. రాజ్ ఇచ్చిన చీర కట్టుకొని మురిసిపోతుంది కావ్య. అప్పుడే రాజ్ ఫోన్ చేస్తాడు. తరువాయి భాగంలో రాజ్, కావ్య రెస్టారెంట్ లో ఉండడం యామిని చూస్తుంది. రాజ్ వెళ్ళాక కావ్య, యామిని మాట్లాడుకుంటారు. నా భర్త అని కావ్య.. నా బావ అంటూ యామిని అనుకుంటారు. త్వరలోనే నాకు భర్త అవ్వబోతున్నాడంటూ యామిని ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.