English | Telugu

Illu illalu pillalu : శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. వాళ్ళకి శోభనం జరిగేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -144 లో.... రామరాజు, వేదవతిల దగ్గరికి శ్రీవల్లి వస్తుంది. ఒకే ముహూర్తానికి రెండు జంటలకు శోభనం జరగకూడదంట అత్తయ్య గారూ.. అలా చేస్తే.. ఇంట్లో అశుభం జరుగుతుందట.. అలా జరిగితే కొత్త కోడలు వచ్చింది అందుకే ఇలా జరిగిందని నలుగురూ నాలుగు రకాలు నన్ను ఆడిపోసుకుంటారు. ఆ నిందను నేను మోయలేను. ఇది నా ఇల్లు.. ఈ ఇంట్లో వాళ్లంతా నా వాళ్లు.. నా వాళ్లంతా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.. నా వాళ్లకి ఏదైనా జరిగితే.. నేను తట్టుకుని బతకలేనండీ.. అందుకే మా శోభనం జరక్కపోయినా ఏం పర్లేదు. ఈ కుటుంబం సంతోషంగా ఉండాలి.. అదే నేను కోరుకునేది.. అందుకే మా శోభనం వాయిదా వేసేసి.. నర్మద చెల్లికి సాగర్ మరిది గారికి శోభనం జరిపించేయండి’ అంటూ తెగ జీవించేస్తుంది శ్రీవల్లి. తాను చెప్పాల్సింది చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామరాజు, వేదవతి ఇద్దరు ఆలోచనలో పడతారు.

కాసేపటికి రామరాజు, వేదవతిల దగ్గరికి నర్మద వచ్చి.. పెద్ద బావ గారి శోభనం జరిపచండి.. ఇన్ని రోజులు ఆగాం కదా ఇంకొన్ని రోజులు ఆగుతామని చెప్పేసి వెళ్తుంది. ఆ మాట విని నా కోడలు బంగారం అంటూ వేదవతి మురిసిపోగా, రామరాజు సంతోషిస్తాడు. ఇక కాసేపటికి శ్రీవల్లి మల్లెపూలు పెట్టుకొని పాలగ్లాస్ తో గదిలోకి వెళ్తుంది కానీ చందు మాత్రం తమ్ముడి శోభనం ఆగిపోయిందని డిస్సపాయింట్ గా ఉంటాడు. ఇక అది చూసి శ్రీవల్లి రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది. నా భయాలు నాకు ఉంటాయి బా.. ఈ శోభనం తరువాత.. మన కుటుంబానికి ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి. మనకి వద్దు.. మీ తమ్ముడికే కార్యం జరిపించమని చెప్పాను కదా.. నా మనసులో అంత కుట్ర ఉంటే.. మన శోభనం జరిపించమనే అనేదాన్ని కదా. మరెందుకు వాళ్ల శోభనం జరిపించమని అత్తమామల్ని అడుగుతానూ. నర్మద నా తోబుట్టువు లాంటిది. తను బాగుండాలని కోరుకుంటాను కానీ.. తనని ఎందుకు బాధపెట్టాలని అనుకుంటాను బావా. ఇంత చిన్న విషయానికి ఇంత అపార్థం చేసుకున్నారంటే.. ముందు ముందు ఇంకెంత అపార్థం చేసుకుంటారో.. ఏంటో నా తలరాతి.. ఇలా తగలడిందని శ్రీవల్లి ఏడుస్తుంది.

వల్లీ ఏడవొద్దు.. నేనేం అనలేదు కదా.. అని భుజంపై చేయి వేసి ఓదార్చుతాడు చందు. హమ్మయ్యా నా కన్నీళ్లకి బాగానే కరిగిపోయాడులే అని శ్రీవల్లి అనుకుంటుంది. ఇక మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. కానీ శోభనం జరిగినట్టు చూపించలేదు. మరోవైపు నర్మద, సాగర్ లు గదిలో ఉంటారు. ఓ ముద్దు లేదు.. ముచ్చట లేదని సాగర్ బాధపడుతుంటే శోభనం లేదని చెప్పాను కానీ ముద్దు ముచ్చట వద్దని ఆపలేదు కదా అని నర్మద అంటుంది. దాంతో సాగర్ ఫుల్ ఖుషీ అయిపోతాడు. ఇంతలో వాళ్ళ గది డోర్ ఎవరో కొట్టిన శబ్దం వినిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.