మామిడి కాయ అంటే గుర్తొచ్చేది మా నెల్లూరు చేపల పులుసు
సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి అంబటి అర్జున్, సుహాసిని, శోభా శెట్టి, ప్రియాంక జైన్ వచ్చారు. ఇక ఈ ప్రోమో మొత్తం జోక్స్ తో నిండిపోయింది. రాగానే అందరికీ కొబ్బరి మామిడి ముక్కలు ఇచ్చింది సుమ. ఆ తర్వాత ఇందులో సుహాసినిని హైలైట్ చేస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేసుకోమని అడిగింది సుమా. "నాకు మామిడి కాయ అంటే గుర్తొచ్చేది మా నెల్లూరు చేపల పులుసు..ఇది తగిలించి పులుసు వేసుకుని తింటే ఉంటాది నా సామి" అంది. దాంతో సుమ అంది చేపలు తిన్న తర్వాత వాటర్ తాగొద్దు ఎప్పుడూ అని అంది. అదేంటో అర్ధం కాక ఆశ్చర్యంగా ఫేస్ పెట్టింది సుహాసిని. "చేపలు పొట్టలోపలికి వెళ్లి గలుగులు చేస్తాయి" అంది. దాంతో నవ్వేసింది సుహాసిని. ఆ తర్వాత ఇంకో ప్రశ్న అడిగింది "చంటిగాడు సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నా కూడా హీరోయిన్ గా కంటిన్యూ అవకపోవడానికి కారణం ఏంటి" అని అడిగింది. "సక్సెస్ వచ్చింది. అది హ్యాపీ థింగ్.