English | Telugu

నా అకౌంట్ బ్లాక్ అయ్యింది...నా స్లీవ్‌లెస్ డ్రెస్ ఫొటోస్ పెట్టి కొత్త స్టోరీలు అల్లొద్దు

ప్రవస్తి ఆరాధ్య తాను పాడుతా తీయగా షోలో ఎదుర్కున్న ఎన్నో ఇష్యుస్ ని బయట పెట్టింది. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రోజూ ఏదో ఒక కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. అలాగే సునీత, కీరవాణి, చంద్రబోస్ వంటి లెజెండరీ సింగర్స్ మీద కూడా అలిగేషన్స్ చేసిన ప్రవస్తికి వాళ్ళు కూడా ఇన్డైరెక్ట్ గా కౌంటర్లు ఇస్తున్నారు. అలాగే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. దానికి ప్రవస్తి కూడా ఊరుకోకుండా రికౌంటర్లు ఇస్తోంది. ఇప్పుడు ఇంకో పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "చాలా మంది నా స్లీవ్‌లెస్ డ్రెస్ ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ, అప్పుడు రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో నేను ఆ దుస్తులు వేసుకోమంటూ నన్ను ఎవరూ బలవంతం చేయలేదు, అది నా ఇష్టం మేరకు వేసుకున్నాను. మన ఇష్టానుసారం వేసుకోవడానికి అలాగే ఎవరైనా మనల్ని ఫోర్స్ చేసి వేసుకునేలా చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఐనా స్లీవ్‌లెస్ డ్రెస్సులు వేసుకోవడం వలన కలిగే సమస్యల గురించి నేను ఎక్కడా ప్రస్తావించలేదు.

నేను చెప్పిన విషయాన్నీ మార్చేసి సొంత కథలు క్రియేట్ చేయొద్దు" అంటూ ఒక కౌంటర్ పోస్ట్ చేసింది. అలాగే ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో కూడా ఒక పోస్ట్ పెట్టింది.. " హాయ్ ..నా అకౌంట్ బ్లాక్ అయ్యి మూడు రోజులు అయ్యింది. "చాకిరీ" అని కామెంట్ చేసిన వీడియోకి కాపీ రైట్ ఇష్యూ వచ్చింది. నేను పోస్టులకు రిప్లై ఇవ్వలేను. నేను బాగున్నాను సేఫ్ గా ఉన్నాను. మీ ఆదరణకు నా కృతఙ్ఞతలు" అని చెప్పింది. అలాగే ప్రవస్తి తనకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారూ వాళ్ళ కామెంట్స్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.