English | Telugu

Illu illalu pillalu : శ్రీవల్లి పెట్టిన ఫిట్టింగ్.. స్టోర్ రూమ్ లో ప్రేమ, ధీరజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -145 లో.....ప్రేమ, ధీరజ్ బయటకు వచ్చి కూర్చుంటారు. మరొకవైపు చందు, శ్రీవల్లి గదిలో ఉంటారు. సాగర్ నర్మద వాళ్ళు ప్రేమలో మునిగిపోతారు. మూడు జంటలు సరదాగా గడుపుతారు. మరుసటి రోజు ఉదయం రామరాజు ఒక దగ్గర టీ తాగుతుంటే ఊళ్ళో పెద్ద మనుషులు రామరాజు గురించి గొప్పగా మాట్లాడుతారు. పెద్ద కోడలికి ఒక్క రూపాయి కట్నం తీసుకోకుండా మీ కొడుకుకి చేసుకున్నారు. కోడళ్ళని కూతుళ్ళలాగా చూసుకుంటారని అందరు గొప్పగా మాట్లాడతారు‌. ఇక అక్కడే ఉన్న సేనాపతి అది వినలేక ఏంటి బాగా చూసుకునేది అని కోప్పడతాడు.

పెద్ద కోడలు వచ్చాక చిన్న కోడలిని బయట పడుకోమ్మన్నారని రామరాజు గురించి నెగెటివ్ గా మాట్లాడతాడు. దాంతో రామరాజు కోపంగా ఇంటికి వచ్చి వేదవతిని పిలిచి మన రూమ్ లో ఉన్న సామాను బయట పెట్టించి అందులో ప్రేమ, ధీరజ్ ని ఉండమని చెప్పు.. ఊళ్ళో వాళ్లంతా చిన్న కోడలు, కొడుకుని బయటకు పంపించారని అనుకుంటున్నారు. మేమ్ హాల్లో ఉంటామని రామరాజు అంటాడు. ఎందుకు మావయ్య వాళ్ళు అందరు చూసేలా అలా బయట పడుకున్నారు కాబట్టి ఈ రోజు అందరిలో మీ పరువుపోయిందని శ్రీవల్లి కావాలనే మాట్లాడుతుంది. వాళ్ళు కావాలని ఏం వెళ్ళలేదని నర్మద మాట్లాడుతుంది.

మీరు హాల్లో ఎందుకు మావయ్య మేమ్ స్టోర్ రూమ్ లో ఉంటామని శ్రీవల్లి అంటుంది. దానికి చందు సరే అంటాడు. మీరెందుకు మేమ్ ఉంటాం స్టోర్ రూమ్ లో అని ధీరజ్ అంటాడు. దానికి రామరాజు సరే అంటాడు. హమ్మయ్య ఒకరికి స్టోర్ రూమ్ కి పంపాను.. ఇంకొక కోడలు సంగతి చూడాలని శ్రీవల్లి అనుకుంటుంది. ధీరజ్, ప్రేమ స్టోర్ రూమ్ కి వెళ్తారు. తరువాయి భాగం లో ప్రేమ, ధీరజ్ ఇద్దరు స్టోర్ రూమ్ క్లీన్ చేస్తారు. అలా క్లీన్ చేస్తున్నప్పుడు ప్రేమ కింద పడిపోబోతుంది. అప్పుడే దీరజ్ పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.