Illu illalu pillalu: భాగ్యంపై భద్రవతికి డౌట్.. కొత్త కోడలు చక్రం తిప్పనుందా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-142లో.. ధీరజ్, ప్రేమలు తమ గదిని ఖాళీ చేస్తుంటారు. నా నిర్ణయం తప్పు అంటావా.. నిన్ను అడగకుండానే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు మీ ఇంట్లో లగ్జరీగా పెరిగావ్.. కానీ ఇప్పుడు మనం ఈ గది ఇచ్చేస్తే నువ్వు నేలపైనే పడుకోవాలి.. నేలపై పడుకోవడం నీకు అలవాటు లేదని నాకు తెలుసు. నీ ఇబ్బంది గురించి ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకున్నా.. కానీ తప్పలేదు. నా నిర్ణయం తప్పైతే సారీ ప్రేమా అని ధీరజ్ అంటాడు. నీ ప్లేస్‌లో నేను ఉన్నా ఇలాగే చేసేదాన్ని. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావ్.. గొప్పగా ఆలోచించావ్.. అలవాటు లేకపోయినా పర్లేదు. కష్టమైనా పర్లేదు.. నేలపైనే పడుకుంటా. నన్ను అడగకుండా నిర్ణయం తీసుకున్నందుకు నువ్వు నాకు సారీ చెప్పాల్సిన పని లేదని ప్రేమ అంటుంది. ఆ మాటతో ధీరజ్.. థాంక్యూ ప్రేమా.. నన్ను బాగా అర్థం చేసుకున్నావని చేయి అందిస్తాడు. అనంతరం ఇద్దరూ చేతులు కలిపేసుకుని ఒకర్నొకరు చూసుకుంటారు. ఇంతలో సాగర్, నర్మదలు వచ్చి లగేజ్ సర్దుకోవడం అయిపోయిందా అని అడుగుతారు. హా అయిపోయింది అయిపోయింది అంటూ లగేజ్ తీసుకుని ప్రేమ, ధీరజ్ బయటకు వచ్చేస్తారు. బయట చందు, శ్రీవల్లిలు ఉండటంతో.. వెల్ కమ్ అంటూ ఇద్దరు స్వాగతం పలుకుతారు.