హృతిక్ రోషన్తో పద్మాలయా స్టూడియోస్ రీమేక్స్!
సూపర్ స్టార్ కృష్ణ నటుడిగా తిరుగులేని స్టార్డమ్ చూశారు. అలాగే దర్శకుడిగానూ తనదైన ముద్రవేశారు. ఎడిటర్ గానూ మెప్పించారు. అంతేకాదు.. పద్మాలయ స్టూడియోస్ పతాకంపై తన సోదరులు జి. హనుమంతరావు, జి. ఆదిశేషగిరి రావుతో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా హిందీ, తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు ప్రొడ్యూస్ చేశారు.