English | Telugu

రవితేజ- రామ్ చరణ్ కాంబినేషన్ లో మూవీ!!

మాస్ మహారాజా రవితేజ హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో ఒక సినిమా తెరకెక్కబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ రెండేళ్ల కిందట మలయాళంలో ఘన విజయం సాధించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ చిత్రానికి రీమేక్ అని సమాచారం.

రామ్ చరణ్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ హక్కులు కొన్నారని, ఒరిజినల్లో పృథ్వీరాజ్ చేసిన సినిమా స్టార్ పాత్రలో చరణే నటిస్తాడని గతంలో వార్తలొచ్చాయి. ఒక దశలో ఈ పాత్రకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రవితేజ పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ పాత్రకు రవితేజ పేరు గట్టిగా వినిపిస్తోంది. రవి తేజ ప్రధాన పాత్రలో ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్‌ ను చరణ్ ప్రొడ్యూస్ చేయబోతుండటం ఖరారైందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ రీమేక్ చేయడం నిజమే అయితే.. మరి ఒరిజినల్లో సూరజ్ చేసిన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పాత్రను ఎవరు చేస్తారో చూడాలి.

ఇక రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత విడుదలయ్యే అవకాశముంది.