English | Telugu
‘పెళ్లి సందD’కి క్రేజీ ఆఫర్.. ఓటీటీలో రిలీజ్!!
Updated : May 28, 2021
శ్రీకాంత్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి సందడి' ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. అలాంటి సినిమాకు ఇన్నేళ్లకు అదే పేరుతో సీక్వెల్ వస్తోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు ప్రముఖ ఓటీటీ సంస్థల నుండి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. త్వరలోనే కొత్త ‘పెళ్లి సందD’ ఓటీటీలో సందడి చేయనుందని సమాచారం.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతబడడంతో సినిమాలు ఓటీటీ బాట పడతున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీలో సందడి చేస్తుండగా.. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ‘పెళ్లి సందD’ కూడా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైందట. రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు ‘పెళ్లి సందD’ని కొనేందుకు ముందుకు వచ్చాయని తెలుస్తోంది. ఓటీటీ సంస్థల నుండి మంచి ఆఫర్స్ రావడం, థియేటర్లు ఇప్పట్లో తెరిచే పరిస్థితి లేకపోవడంతో మేకర్స్ కూడా ఓటీటీలో రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
కాగా, రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ‘పెళ్లి సందD’కి గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రోషన్ కి జోడిగా శ్రీలీలా నటిస్తోంది.