English | Telugu

మహేష్-త్రివిక్రమ్ మూవీలో నివేథా థామస్!!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా తరువాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచాలనే ఉన్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశముంది. అయితే ఈ మూవీ లో మరో హీరోయిన్ నివేథా థామస్ కూడా నటించనుందని టాక్ వినిపిస్తోంది.

తక్కువ సినిమాలతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేథా థామస్.. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్‌ లో వేముల పల్లవిగా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత నివేథాకు వరుసగా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. తాజాగా మహేష్-త్రివిక్రమ్ మూవీలో ఓ కీలక పాత్ర కోసం నివేథా పేరును పరిశీలిస్తున్నారట. దాదాపు ఈ పాత్రకి నివేథా పేరు ఫైనల్ అయినట్టు సమాచారం.

కాగా, మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లాక్ డౌన్ తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.