English | Telugu

'కింగ్ మేకర్'గా మెగాస్టార్!!

మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. మోహన్ లాల్ హీరోగా మలయాళంలో తెరకెక్కిన లూసిఫర్ ఘన విజయం సాధించింది. దీనిపై మనసు పడ్డ మెగాస్టార్ దీన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ రీమేక్ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా దాదాపు పూర్తి కాగా.. తాజాగా ఈ చిత్రానికి ఓ పవర్ ఫుల్ పెట్టినట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ సినిమా అంటే పవర్ ఫుల్ టైటిల్ ఉండాలని అభిమానులు కోరుకుంటారు. దీని దృష్టిలో పెట్టుకొని లూసిఫర్ రీమేక్ కు 'కింగ్ మేకర్' అనే టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టైటిల్ పట్ల చిరంజీవి కూడా సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

కాగా, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్.. ఈ సినిమా పూర్తవగానే లూసిఫర్ రీమేక్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అంతే కాకుండా ఇప్పటికే ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రెండు పాటలను కూడా సిద్ధం చేసారని సమాచారం.