English | Telugu
బాలయ్య మూవీ రిజెక్ట్ చేసిన రకుల్!!
Updated : May 29, 2021
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదించగా రిజెక్ట్ చేసిందని సమాచారం.
ఒకప్పుడు వరుస తెలుగు సినిమాలతో సందడి చేసిన రకుల్.. ఈ మధ్య తెలుగు సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ బ్యూటీ బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 'ఎటాక్', 'మే డే' అనే రెండు హిందీ సినిమాలలో నటిస్తోంది. హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో బాలయ్య మూవీలో యాక్ట్ చేయడానికి రకుల్ నిరాకరించినట్లుగా టాక్ వినిపిస్తోంది.
కాగా, ఈ ఏడాది రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని.. బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ మూవీ చేయడానికి సిద్ధమయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.