English | Telugu
థ్రిల్ చేయబోతున్న కాజల్!!
Updated : May 29, 2021
అప్పట్లో హీరోయిన్స్ కి పెళ్లి తరువాత సినిమాలు తగ్గిపోతాయి అనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లి తరువాత కూడా కొందరు హీరోయిన్స్ తమ జోరు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సమంత వరుస సినిమాలతో అలరిస్తోంది. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ మునుపటి కంటే ఎక్కువ పేరు సంపాదిస్తోంది. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేరింది.
పెళ్లి తరువాత కూడా కాజల్ వరుస సినిమా ఆఫర్స్ పట్టేస్తోంది. ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున వంటి స్టార్స్ తో నటిస్తూనే.. మరోవైపు ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ కి సై అంటోంది. తాజాగా కాజల్ ఓ థ్రిల్లర్ మూవీలో నటించడానికి ఓకే చెప్పిందని సమాచారం. 'పేపర్ బాయ్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జయశంకర్ దీనిని తెరకెక్కించనున్నాడట. ఈ మధ్య ఓటీటీలో విటమిన్-షీ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చి ఆకట్టుకున్న జయశంకర్.. ఇప్పుడు కాజల్ కోసం ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్ రెడీ చేసి ఒప్పించాడని తెలుస్తోంది. జులై నుంచి సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాను.. కాజల్ బర్త్ డే సందర్భంగా జూన్ 19న అధికారకంగా అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.