English | Telugu

రష్మీ రాకెట్‌.. దూసుకొస్తున్న తాప్సీ!!

తాప్సీ నటించిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీ 'రష్మీ రాకెట్‌' విడుదలకు రెడీ అయింది. అకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహించిన ఈ సినిమాను త్వరలో ఓటీటీ ద్వారా రిలీజ్ చేయబోతున్నారట. మరికొన్ని రోజులలో అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

ఈ మూవీలో గుజరాత్‌ కు చెందిన అథ్లెట్‌ రష్మీగా తాప్సీ కనిపించనుంది. ఈ చిత్రం కోసం తాప్సీ ఎంతో కష్టపడింది. అథ్లెట్‌ రష్మీ పాత్రలో ఒదిగిపోయేందుకు తాప్సీ ప్రత్యేకంగా దుబాయ్‌లో శిక్షణ కూడా తీసుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యి.. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే కరోనా నేపథ్యంలో ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో చర్చలు జరిగాయని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

కాగా, గతంలో పలు తెలుగు సినిమాలలో నటించిన తాప్సీ ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. భారత మహిళా క్రికెటర్ మిథాలి రాజ్‌ బయోపిక్‌ తో పాటు ప్రస్తుతం తాప్సీ చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి.