English | Telugu

ఆ విష‌యంలో అస‌లు త‌గ్గ‌నంటున్న శ్రియ‌

నేను ఎక్క‌డున్నా, ఏం చేసినా నా ఫ్యాన్స్ న‌న్ను ఆద‌రిస్తున్న తీరు చూసి ఆశ్చ‌ర్య‌పోతూ ఉంటాను. వారిని ఎప్పుడూ నిరాశ‌ప‌ర‌చ‌ను. వారి ఎక్స్ పెక్టేష‌న్స్ కి త‌గ్గ‌ట్టు ఉండాల‌నుకుంటాను అని అంటున్నారు అందాల భ‌రిణ శ్రియా శ‌ర‌ణ్‌. ఆమె న‌టించిన అండ‌ర్‌వ‌రల్డ్ కా క‌బ్జా సినిమా మార్చి 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఉపేంద్ర స‌ర‌స‌న న‌టించారు శ్రియ‌.

నాకు 2022 చాలా చాలా బాగా క‌లిసొచ్చింది. ప్యాండ‌మిక్ టైమ్‌లో కంప్లీట్‌గా నేను ఫ్యామిలీతోనే ఉన్నాను. గ‌ర్భ‌వ‌తిన‌య్యాను. పాప‌కు జ‌న్మ‌నిచ్చాను. అలా నేను అనుకున్న ఫ్యామిలీని సెట్ చేసుకోగ‌లిగాను. లాస్ట్ ఇయ‌ర్ రిలీజైన ట్రిపుల్ ఆర్‌, దృశ్యంకి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. నేను ఏం చేసినా ఫ్యాన్స్ అద్భుతంగా రిజీవ్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఉపేంద్ర సినిమా అండ‌ర్‌వ‌ర‌ల్డ్ కా క‌బ్జాతో మీ ముందుకు వ‌స్తున్నాను. ఈ సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది. ప్రేక్ష‌కుల‌కు ఆనందాన్ని పంచడమే నా ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం. దానికోసం ఎంత ఫిట్‌గా అయినా ఉంటాను. ఎంత క్లిష్ట‌మైన కేర‌క్ట‌ర్‌ని అయినా చేస్తాను. ఈ అనుభ‌వం ఎవ‌రికీ రాదు. న‌టిగా ఇంత మంది అభిమానాన్ని పొందినందుకు చాలా ఆనందంగా ఉంది`` అని అన్నారు శ్రియ‌.

ఉపేంద్ర హీరోగా తెర‌కెక్కుతున్న క‌బ్జాను ప్యాన్ ఇండియా సినిమాగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాలో ముర‌ళీ శ‌ర్మ‌, న‌వాబ్ షా, కోట శ్రీనివాస‌రావుతో పాటు ప‌లువురు న‌టీన‌టులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆర్‌.చంద్రు డైర‌క్ట్ చేసిన చిత్ర‌మిది. ఆనంద్ పండిట్ మోష‌న్ పిక్చ‌ర్స్, శ్రీ సిద్ధేశ్వ‌ర ఎంట‌ర్‌ప్రైజెస్, అలంకార్‌ పాండియ‌న్ తెర‌కెక్కిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.