English | Telugu

రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తోన్న శంక‌ర్!

ప్రస్తుతం దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పిన ప్రాణాలకే ముప్పు. ఇలా ఆయ‌న రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఒకవైపు ఆర్సి15, మరోవైపు ఇండియన్ 2 చిత్రాలతో ఆయన టెన్షన్ పడుతున్నారు. సాధార‌ణంగా రాజ‌మౌళి త‌ర‌హాలోనే శంక‌ర్ కూడా తాన‌నుకున్న అవుట్ పుట్ వ‌చ్చే వ‌ర‌కు రాజీ ప‌డ‌ర‌. దాని కోసం 100కి 200శాతం ఎఫ‌ర్ట్ పెడ‌తారు. ఒక చిత్రం షూటింగ్ జ‌రుగుతుంటే మ‌రో చిత్రం గురించి క‌నీసం ఆలోచ‌న కూడా చేయ‌రు. ఒక చిత్రం పూర్త‌యిన త‌ర్వాత మ‌ర‌లా త‌ర్వాతి చిత్రం కోసం దృష్టి పెడ‌తారు.

1996లో కమల్ హీరోగా వచ్చిన భారతీయుడుకు సీక్వెల్ గా ఇండియన్ 2చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారతీయుడు చిత్రం హిందీలో కూడా అద్భుతమైన కలెక్షన్లను నాడే కొల్లగొట్టింది. దాంతో ఇండియ‌న్ 2 చిత్రం కూడా పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. షూటింగ్ స్పాట్లో ప్రమాదం జ‌రిగింది. క్రేన్ యాక్సిడెంట్ కావడంతో ముగ్గురు సిబ్బంది చనిపోవడం ఆయ‌న్ని క‌ల‌చి వేసింది. అంత‌లోనే లైకా సంస్థ వారికి ఆయ‌న‌కు మధ్య విభేదాలు వ‌చ్చాయి. దాంతో ఇండియన్ 2 ను కొంతకాలం ఆపేశారు. ఈ సమయంలో ఆయన ఆర్సి15 చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు. ఆయ‌న ఆర్సీ 15 చిత్రం ఓకే చేసే స‌మ‌యంలో ఇండియ‌న్ 2 చిత్రం మ‌ర‌లా చేయాల్సి వ‌స్తుంద‌ని, అది కూడా ఆర్సీ 15 షూటింగ్ స‌మ‌యంలోనే దానిని కూడా తీయాల్సి వ‌స్తుంద‌ని ఊహించ‌లేదు. రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా శంకర్ ఆర్సీ15 చిత్రం చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ జె సూర్య, జయరాం, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు నటిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే రాజమండ్రి, హైదరాబాద్, అమృత‌స‌ర్ ల‌లో జరిపారు. అయితే ఎప్పుడైతే ఇండియ‌న్ 2 తెర‌పైకి వ‌చ్చిందో అప్పటినుంచి ఆర్సి15కి కష్టాలు మొదలయ్యాయి. ఈ చిత్రం ప్ర‌క‌టించి రెండేళ్ల‌వుతోంది. గత కొంతకాలంగా ఈ చిత్రం షూటింగ్ సాగుతోంది. ఈ రెండు చిత్రాల వల్ల శంకర్ పై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది. ప్రస్తుతం ఇండియ‌న్2 షూటింగ్ ఏపీలోని గండికోటలో జరుగుతోంది. ఇటీవ‌ల కొంత‌కాలం తిరుప‌తిలో షూటింగ్ చేశారు. ఇలా ఒకేసారి రెండు చిత్రాలు అనే త‌న మ‌న‌సుకు న‌చ్చ‌ని ప‌నిని శంక‌ర్ మ‌న‌సు చంపుకుని చేస్తున్న‌ట్లు స‌మాచారం. తాజాగా చేస్తోన్న ఇండియ‌న్ 2 తాజా షెడ్యూల్ పూర్తయితే గానీ ఆర్సి15 కొత్త షెడ్యూల్ను మొదలు పెట్ట‌డం వీలు కాదు. దిల్ రాజుకు ఈ మూవీ ఆలస్యం అవ్వడం వల్ల భారీగా వడ్డీలు పెరిగిపోతున్నాయట. దాంతో దిర్రాజు శిరీష్లు టెన్షన్ పడుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూవీ ని రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నారు. అయినా కొత్త దర్శకులతో ఉండే కంఫర్టబులిటీ గాని, త‌ను పరిచయం చేసి అగ్ర దర్శకులుగా మారిన వారితో చేసినప్పుడు ఉండే సహకారం వంటివి శంకర్ వంటి దర్శకుడితో ఉండవని దిల్ రాజుకి ఈపాటికి అర్థం అయిపోయి ఉంటుంది.

శంకర్ వంటి ద‌ర్శ‌కుని చేతికి సినిమా వెళ్లిన తర్వాత ఆయన చెప్పినట్టు నిర్మాత నడుచుకోవాల్సిందే గాని దిల్ రాజు చెప్పిన‌ట్లు శంకర్ విన‌రు. ఒక్క శంకర్ మాత్ర‌మే కాదు... రాజమౌళి స‌హా ఏ అగ్ర ద‌ర్శ‌కుడైనా ఇదే ప‌రిస్థితి. కానీ ఇంతకాలం దిల్ రాజు చేసిన చిత్రాలు ఒక ఎత్తు. శంక‌ర్ చిత్రం మ‌రో ఎత్తు. ఇంత‌కాలం సొంతంగా తానే దర్శకులను పరిచయం చేశారు. తాను పరిచయం చేసి దర్శకులుగా పేరు తెచ్చుకున్న వారితో పెద్ద చిత్రాలు చేశారు. కానీ ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు లెజెండ్ అని పేరొందిన ద‌ర్శ‌కుల‌తో చిత్రాలు చేయ‌లేదు. కానీ శంకర్ వంటి దర్శకునితో ఆయన చిత్రం చేయడం ఇదే తొలిసారి. దాంతో ఆయనకు ఈ సినిమా పెద్ద టెన్షన్ గా మారింది. దిల్ రాజు శిరీష్ లు ఈ చిత్రం విషయంలో ఎంతో టెన్షన్ పడుతున్నారట. మొత్తానికి శంకర్ ఎదుర్కొంటున్న ఒత్తిడి వలన ఈ రెండు చిత్రాల మేకింగ్ మీద ఆ ఎఫెక్ట్ పడుతుందా లేక ఆయన ఈ టెన్షన్లని పక్కనపెట్టి సినిమాల విషయమే ఆలోచిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ రెండు చిత్రాలకు ఒత్తిడితో ఏమాత్రం ఇబ్బంది పడ్డ అది శంకర్ తీసే సినిమాల క్వాలిటీపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.