మీలో ఒకదాన్నేనంటున్న వరలక్ష్మీ
నేను మీలో ఒకదాన్నే... అందుకే ఈ పోస్ట్ అంటూ వరలక్ష్మీ శరత్‌కుమార్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఉన్నట్టుండి వరలక్ష్మీ అలాంటి పోస్టు ఎందుకు పెట్టినట్టు? అని అనుకుంటున్నారా? డీటైల్స్ చదివేయండి మరి! వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇన్‌స్టా ఫాలోయర్స్ సంఖ్య రెండు మిలియన్లకు చేరుకుంది. షూటింగ్ సరదాలతో పాటు, స్టాఫ్‌తోనూ, ఇంట్లో కుక్కపిల్లతోనూ, వర్కవుట్ చేస్తున్నప్పుడు తీసుకున్న వీడియోలతో తన ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తూనే ఉంటారు వరలక్ష్మీ శరత్‌కుమార్. అందుకే ఆమె ఇన్‌స్టా ఫాలోయర్ల సంఖ్య ఝుమ్మంటూ పెరిగారు. అలా ఉన్నపళాన ఫాలోయర్స్ రీచ్ రెండు మిలియన్లు అని చూసుకునేసరికి వరలక్ష్మికి చాలా ఆనందంగా అనిపించిందట. ఆ ఆనందంతోనే గెంతులు వేస్తూ, స్టెప్పులు వేస్తూ వీడియో చేశారు. ఆ వీడియో షేర్ చేశారు....