English | Telugu

నాని ద‌స‌రా స్పీడు మామూలుగా లేదు!

నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోంది. మార్చి 30న విడుదల కానుంది. భారీ బడ్జెట్లో రూపొందుతోంది. నాని డిఫరెంట్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. తెలుగులో ఇప్పటివరకు చేయనటువంటి విభిన్న పాత్రను చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంచనాలను పెంచింది. దీనితో దసరా ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ సాంగ్ రిలీజ‌యింది. సెకండ్ సాంగ్ ని మూడో వారంలో విడుదల చేస్తున్నారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు. తమిళంలో ఈయన సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. తెలుగు ప్రేక్షకుల‌కు అద్భుత‌మైన సంగీతం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈచిత్రానికి బీజీఎం చాలా ముఖ్య‌మట‌. దాంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప‌రంగా కూడా శ్రద్ధ వహిస్తున్నారు.

ఈ చిత్రం మ్యూజిక‌ల్ హిట్‌గా నిల‌వాలంటే ఆ బాధ్యత సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ పై ఆధారపడి ఉంది. గతంలో ఇలాంటి చిత్రాలే అయిన రంగ‌స్థ‌లం, పుష్ప చిత్రాలు సంగీత‌ప‌రంగా సంచ‌ల‌నం సృష్టించాయి. పాట‌ల‌తో పాటు బీజీఎం అదిరిపోయేలా కుదిరింది. ఇప్పుడు ద‌స‌రా చిత్రానికి ఆ రేంజ్ సంగీతం అందించాల్సిన బాధ్య‌త సంతోష్ నారాయ‌ణ్ పై ఉంది. దాంతో ఆ ప‌రంగా సంతోష్ నారాయ‌ణ్ పై పెద్ద బాధ్య‌త ఉన్న‌ట్లే లెక్క‌. ఇందులో నానికి జోడిగా కీర్తి నరేష్ న‌టించింది. అయితే ఆమె ట్రైల‌ర్ లో కనిపించలేదు. ఇందులో కీర్తి సురేష్ పాత్ర కూడా మాసివ్ గా ఉండ‌నుంద‌ని, ఆమె డీగ్లామ‌ర్ లుక్లో క‌నిపిస్తోంద‌ని కీర్తిసురేష్ ఫస్ట్ లుక్ లో చూపించారు.

అయితే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ చేసిన విధానం ఏ విధంగా ఉంది అనేది ఆసక్తి కలుగుతోంది. రంగస్థలంలో సమంత, పుష్పలో రష్మిక బాగా చేసి మెప్పించారు. ఇప్పుడు స‌మంత‌, ర‌ష్మిక స్థాయిలో కీర్తిసురేష్ న‌ట‌న‌ను పోల్చి చూస్తారు. దాంతో ఇందులో కీర్తి సురేష్ డిఫరెంట్ క్యారెక్టర్ గా ట్రై చేస్తోంది. ఇందులో ఆమె పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తోందని సమాచారం. మరి ఈ పాత్రకు కీర్తి సురేష్ ఏ మాత్రం న్యాయం చేయగలదు? అనే దానిపై అందరి ఆసక్తి నెలకొని ఉంది.