ఆ సినిమా సీక్వెల్‌ని కన్ఫర్మ్ చేసిన మమ్ముట్టి!
మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి 71 ఏళ్ల వయసులోనూ క్షణం తీరికగా లేరు. అసలు ఖాళీగా కూర్చోవడం అంటే ఎలా ఉంటుంది? అంటూ చమత్కరిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ, సక్సెస్‌లను టేస్ట్ చేస్తూ, ఫెయిల్యూర్స్ ని పాఠాలుగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు మమ్ముట్టి. పాత్ర ఎలాంటిదైనా, సన్నివేశం ఏం డిమాండ్ చేసినా, వెంటనే పరకాయ ప్రవేశం చేసి శభాష్ అనిపించుకుంటారు మమ్ముట్టి...