రెమ్యూనరేషన్ లో తగ్గేదే లే అంటున్న పాన్ ఇండియా స్టార్!
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఏడు చిత్రాలు ఉన్నాయి. ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతీ చిత్రం, సిద్ధార్థ ఆనంద్ చిత్రం, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించబోయే స్పిరిట్ మూవీ, దిల్ రాజు నిర్మాతగా సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ తో మరో చిత్రం... ఇలా పలు చిత్రాలను ఆయన లైన్ లో పెట్టారు. ఆది పురుష్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇక సలార్, ప్రాజెక్టు కే సినిమాలను సమాంతరంగా పూర్తి చేస్తూ వస్తున్నారు. మధ్యలో సమయం దొరికినప్పుడు మారుతి చిత్రానికి డేట్స్ సర్దుబాటు చేస్తున్నారు...