English | Telugu

అదిరిపోయే క్యాస్టింగ్ తో విజయ్ ‘లియో’!

కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న 67వ చిత్రం షూటింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రం లోకేష్ కనకరాజు దర్శ‌కత్వంలో రూపొందుతోంది. గతంలో లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన విజ‌య్ న‌టించిన మాస్టర్ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో విజయ్ 67 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి అంద‌రినీ ఆక‌ట్టుకునేలా లియో: బ్ల‌డీ స్వీట్ అనే టైటిల్ ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే.ఈ సినిమా మాస్టర్ సినిమాకి సీక్వెల్ గా కొనసాగుతుందని కొందరు భావిస్తున్నారు. కానీ మాస్టర్ చిత్రానికి ఈ తాజా చిత్రానికి కథలో ఏమాత్రం సంబంధం లేదని క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాలో పలువులు బాలీవుడ్ నటులు సైతం నటిస్తున్నారు. కేజీఎఫ్ చాప్ట‌ర్ 2లో న‌టించిన సంజయ్ దత్ ఈ చిత్రంలో నటించేందుకు తన అంగీకారం తెలిపారు.

ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ కూడా నటించనుంది. సంజయ్ దత్ కే జి ఎఫ్ చాప్టర్ 2 తర్వాత ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కూడా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.అయితే వాటిలో ఎంతవరకు నిజముందో తెలియదు. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కానీ విజయ్ చిత్రంలో సంజయ్ దత్తు నటించే విషయమై అధికారిక ప్రకటన వచ్చేసింది. లోకేష్ కనకరాజు విక్రమ్ వంటి హిట్ తర్వాత తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష న‌టిస్తుండ‌గా, యాక్షన్ కింగ్ అర్జున్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ లియో: బ్ల‌డీ స్వీట్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. టైటిల్‌కి సంబంధించిన ప్రొమో చాలా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రాన్ని ఈ యేడాది దీపావళి కానుకగా 19 అక్టోబర్‌న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాను భారీ రేటుకు సన్ నెట్‌వర్క్ కొనుగోలు చేసింది. అటు డిజిటల్ పార్ట్‌నర్ నెట్‌ఫ్లిక్స్ అంటూ పోస్టర్‌లో వేసారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే ఈ రేంజ్‌లో డిజిటల్, శాటిలైట్ రైట్స్ దాదాపు రూ. 100 కోట్లకు పైగా అమ్ముడుపోవడం విశేషం. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తమిళం,తెలుగు, కన్నడ, హిందీలో విడుదల చేస్తున్నట్టు ఈ మూవీ ప్రోమో‌లో చూపించారు. విజయ్ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా ఈ సినిమా ఉండనుంది. రీసెంట్‌గా ‘వారసుడు’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువైన విజయ్.. మరోసారి తన మార్క్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.